అత్యాచారం ఇప్పుడు ఈ పదం వింటే చాలు షాద్ నగర్ వెటర్నరీ వైద్యురాలు దిశ కేసు ఏ గుర్తస్తుంది. అంత అమానవీయంగా జరిగింది ఆ ఘటన. పని ఉండి బయటకు వెళ్లిన ఆ అమ్మాయిని నలుగురు లారీ డ్రైవర్లు కలిసి సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి పెట్రోల్ పోసి ఆమె శవాన్ని ముట్టుకొనేకి కూడా లేకుండా పెట్రోల్ పోసి కాల్చిపడేశారు ఆ నీచులు.      

 

అయితే ఆ నీచులు కూడా సిన్ రికర్రెక్షన్ చేస్తున్న సమయంలో ఆ నిందితులు పారిపోవాలని చూసి పోలీసులపై దాడి చెయ్యడం వల్ల పోలీసులు ఆత్మరక్షణ కోసం ఆ నిందితులపై కాల్పులు జరిపారు. దీంతో ఆ నిందితులు నలుగురు నిన్న తెల్లవారుజామున ఉదయం 5గంటలకు మృతిచెందారు.       

 

అయితే ఇప్పుడు ఈ దిశ కేసులో నిందితులు మృతిచెంది బాధిత కుటుంబానికి న్యాయం జరపగా.. ఇలాంటి అత్యాచార ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ప్రతి పది నిమిషాలకు ఒక మహిళపై అత్యాచారం జరుగుతుంది. ఇలా అత్యాచారాలు జరగటం వల్ల ఎందుకు ఇలా జరుగుతున్నాయి అని అందరూ అందరిని ప్రశ్నించుకోగా వారు చెప్పిన సమాధానాలు చాల ఆశ్చర్యాన్ని కల్గిస్తున్నాయి.     

 

ఆ సమాదానాలు ఏంటంటే.. కొందరు అబ్బాయిలు ఎప్పుడు చికెన్, మటన్ తీసుకోవటం వల్ల రజో గుణం పెరిగి కనిపించిన అమ్మాయిపై అత్యాచారాలు చేస్తున్నారని... ఆ సమయంలో ఎం చేస్తున్నారో కూడా తెలియకుండానే అమ్మాయిపై అత్యాచారం చేసి హత్య చేస్తున్నారని ఓ వ్యక్తి పేర్కొన్నాడు. 

 

బయట తీసుకునే ఆహారంలో రజో గుణం ఎక్కువ ఉంటుంది అని.. బయట ఆహారంలో వాడే కొన్ని కెమికల్స్ ఏ ఇందుకు కారణం అని అయన పేర్కొన్నారు. అయితే ఈ స్టేట్మెంట్ కి సంబంధించిన ఆడియో ప్రస్తుతం వాట్సాప్ లో వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: