ఈరోజుల్లో ప్రైవేటు ఉద్యోగాలలో పని చేసేవారికి జాబ్ ఉంటుందో ఊడుతుందో తెలీని పరిస్థితి నెలకొంది. అకస్మాత్తుగా ఉద్యోగం పోతే చాలా ఇబ్బందులు పడాలి. ఉద్యోగం పోతే కుటుంబాన్ని పోషించడం, ఖర్చులను భరించడం అంత తేలిక కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలలో పని చేసే వారికి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ ఉద్యోగుల కోసం ఒక కొత్త స్కీమ్ ను ప్రవేశపెట్టింది. 
 
అటల్ ఇన్సూరుడ్ పర్సన్స్ వెల్ ఫేర్ స్కీమ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ వలన ప్రైవేట్ ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఈ స్కీమ్ లో చేరిన ప్రైవేట్ ఉద్యోగులు ఎవరైతే తమ ఉద్యోగానికి రాజీనామా చేస్తారో వారు 24 నెలలపాటు జీతం పొందవచ్చు. ఈఎస్ఐ 90 రోజుల్లో రాజీనామా చేసిన వ్యక్తి సంపాదించే జీతంలో 25 శాతాన్ని బ్యాంక్ అకౌంట్ లో వేస్తుంది. జీతాన్ని ఈఎస్ఐసీ ద్వారా పొందే సదుపాయాన్ని ఈ స్కీమ్ ద్వారా ప్రవేశపెట్టారు. 
 
ప్రైవేట్ ఉద్యోగులు ఈ స్కీమ్ కు ధరఖాస్తు చేసుకోవాలంటే మొదట ఈఎస్ఐసీ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఈఎస్ఐసీ వెబ్ సైట్ లో అటల్ ఇన్సూరుడ్ పర్సన్స్ వెల్ ఫేర్ స్కీమ్ కు సంబంధించిన ఫామ్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఫామ్ ను నింపిన తరువాత ఈఎస్ఐ బ్రాంచ్ లో సమర్పించాలి. ఫామ్ తో పాటు 20 రూపాయల నాన్ జ్యుడిషియల్ పేపర్ ను నోటరీకి జత చేయాలి. అతి త్వరలో ఈ స్కీమ్ కు ఆన్ లైన్ లో ధరఖాస్తు నింపే అవకాశం కూడా రానుందని తెలుస్తోంది. 
 
www.esic.nic.in వెబ్ సైట్ ను సందర్శించి ఈ స్కీమ్ కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవచ్ఛు. ఈ స్కీమ్ ద్వారా ప్రతి ఉద్యోగికి ఒకసారి మాత్రమే లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఉద్యోగానికి రాజీనామా చేసిన వారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. కంపెనీ ఉద్యోగం నుండి తొలగించినా, స్కీమ్ కు ధరఖాస్తు చేసుకున్న వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు అయినా ఈ స్కీమ్ వర్తించదు. వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకున్న వారికి కూడా ఈ స్కీమ్ వర్తించదు. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: