వైసీపీలో నెంబర్ టూ గా వెలుగొందుతున్న నాయకుడు ఎవరంటే ఠక్కున చెప్పే పేరు విజయసాయిరెడ్డి.. ఆయన తాజాగా ఓ కోరిక బయట పెట్టారు. అదేంటంటే.. వచ్చే పాతిక ఏళ్లు వైసీపీయే అధికారంలో ఉండాలని.. కోరికగా కాదు.. ఆయన చాలా దీమాగా ఈ విషయం చెప్పారు. ఇంకో 25 సంవత్సరాల పాటు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంటుందని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఢంకా భజాయిస్తున్నారు.

 

ఎందుకంటే రాష్ట్రంలో అన్ని వర్గాల ఆదరణ చూరగొంటున్న సీఎం జగన్ అని ఆయన చెబుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని, బీసీలకు సీఎం వైయస్‌ జగన్‌ పెద్దపీట వేశారని విజయిసాయిరెడ్డి అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ సిద్ధాంతాలను నమ్మి.. తన చిన్ననాటి మిత్రుడు బీద మస్తాన్‌రావు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారని విజయ సాయి రెడ్డి అన్నారు.

 

1982 నుంచి తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న బీద మస్తాన్‌రావు సీఎం వైయస్‌ జగన్‌ పరిపాలనకు ఆకర్షితుడై వైయస్‌ఆర్‌సీపీలో చేరడం జరిగిందని విజయ సాయి రెడ్డి అన్నారు. ఆయన చేరిక సంతోషంగా ఉందన్నారు. జనాభా ప్రాతిపదకన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభలో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు ప్రవేశపెట్టిన ఘనత వైయస్‌ఆర్‌ సీపీకే దక్కిందని విజయ సాయి రెడ్డి అన్నారు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా.. మంత్రివర్గంలో 60 శాతం చోటు కల్పించారని విజయ సాయి రెడ్డి అన్నారు. బీసీలకు సీఎం వైయస్‌ జగన్‌ పెద్దపీట వేస్తున్నారని, బీసీలంతా సీఎం వైయస్‌ జగన్‌ వెంటే ఉంటారని అన్నారు. మరో పాతికేళ్లు సీఎం అని ఇప్పుడు జగన్ ను విజయసాయిరెడ్డి అన్నారు. గతంలో ఏపీలో టీడీపీ శాశ్వతంగా అధికారంలో ఉంటుందని చంద్రబాబు అన్నారు. బహుశా అధికారంలో ఉన్న కిక్కే అలాంటిది కావచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: