దిశ అత్యాచార, హత్య ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. లైంగిక నేరాలు- అమలవుతున్న శిక్షలు అనే అంశంపై దేశ వ్యాప్తంగా చర్చ జరగుతోంది. ఇదే సమయంలో ఇప్పటి వరకూ శిక్షలు పడిన అనేక మంది కామాంధుల గాధలు ప్రస్తావనకు వస్తున్నాయి. అలాంటిదే ఈ కథ. ఇది ఇదే ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అమానుష కాండ. అమ్మాయిల భయాన్ని, పిరికితనాన్ని వాడుకుని చెలరేగిపోయిన కామాంధుల కథ.

 

అసలేం జరిగిందంటే.. తమిళనాడు పొలాచ్చిలో కళాశాల విద్యార్థిని ని పరిచయస్తులైన శబరిరాజన్‌, తిరునవక్కరుసు.. సతీష్‌, వసంతకుమార్‌ అనే మరో ఇద్దరితో కలిసి మాయమాటలు చెప్పి కారులోకి పిలిచారు. ఆమెను బలవంతంగా బట్టలు లాగేసి సెల్ ఫోన్ తో చిత్రీకరించారు. ఆ దృశ్యాలను అడ్డుపెట్టుకుని పదే పదే ఆమెను బెదిరిస్తూ వచ్చారు. తాము ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి తమ కోరిక తీర్చాలని వేధించడం మొదలు పెట్టారు.

 

ఆ బాలిక ధైర్యం చేసి తన అన్నయ్య విషయం మొత్తం చెప్పింది. అతడు పోలీసులను ఆశ్రయించాడు. అప్పుడు బయటపడింది అసలు కథ. ఆ కామాంధులు దాదాపు 200 మంది యువతులు, మహిళల్ని ఇలానే వేధించారట. పోలీసుల విచారణలో ఆ వీడియోలన్నీ బయటకు వచ్చాయి. నిందితుల సెల్ ఫోన్లలో ఉన్న ఆ చిత్రాలు అప్పటికే వారు సర్క్యులేట్ చేసుకున్నారు.కానీ ఈ కేసు ఇప్పటి వరకూ తేలలేదు.

 

ఆ తర్వాత క్రమంగా ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంది. మొత్తం రాకెట్‌లో తమిళనాడు డిప్యూటీ స్పీకర్‌ జయరామన్‌ కుమారుల ప్రమేయం ఉందంటూ వార్తలు వచ్చాయి. ఈ కేసులో ఇప్పటి వరకూ బాధితులకు న్యాయం జరగ్గపోగా... పోలీసులు స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌లోని వీడియోలు మాత్రం వైరల్‌ అవుతూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: