సాంకేతికతను సరైన దిశగా ఉపయోగించుకుంటే ఎన్నో నేరాలను అరికట్టవచ్చు. అందుకే మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసులు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏపీ పోలీసులు సరికొత్త యాప్‌ను రూపొందించారు.. పోలీసుశాఖ టెక్‌ విభాగం ఆధ్వర్యంలో ఈ యాప్‌ను తెస్తున్నారు.

 

 

ఇప్పటికే దాదాపు 60 సేవలను మీ–సేవ ద్వారా పౌరులకు అందిస్తున్నాండగా. మరిన్ని సేవలు అందించేందుకు గాను ఇప్పుడు ‘స్పందన సురక్ష’ యాప్‌ రూపొందించారు... ఈ యాప్ ద్వారా 89 రకాల పోలీసు సేవలను మొబైల్‌ ఫోన్‌ ద్వారా పౌరులు ఉన్న చోటు నుంచే పొందవచ్చు. ఇకపోతే పోలీసు శాఖ పరిధిలో అత్యవసర సమయాల్లో డయల్‌ 112, ఈ మెయిల్స్, వెబ్‌ సెర్చింగ్, ఎస్‌ఎంఎస్‌ లాంటి అన్ని కీలక లింక్‌లు ఈ యాప్‌తో అనుసంధానమై  ఉంటాయి. వీటిలో ఏ ఒక్కటి ఉపయోగించినా అత్యవసర సిగ్నల్‌ ద్వారా పోలీసులను అప్రమత్తం చేస్తుంది. వీరు రూపొందించిన ఈ యాప్‌ ద్వారా ప్రజలు పోలీసులకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.

 

 

అది కాకుండా  ఫిర్యాదు రశీదు కూడా యాప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవడంతో పాటుగా ఏ చర్యలు తీసుకున్నారో తెలుసుకోవచ్చు. ఈ చలానా ద్వారా వాహనాలకు విధించే అపరాధ రుసుము, ఎప్పుడు ఫైన్‌ పడింది? ఎంత చెల్లించాలి? తదితర వివరాలను యాప్‌ ద్వారా తెలుసుకుని చెల్లింపులు జరపవచ్చు.. వీటితోపాటుగా సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేవారు యాప్‌ ద్వారా సమాచారం అందిస్తే పోలీసులు లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, ప్రత్యేక పోలీస్‌ బీట్‌ ద్వారా రక్షణ కల్పిస్తారు. సొత్తు రికవరీ ఆప్షన్‌లో చోరీకి గురైన నగదు, బంగారం, వాహనాలు, మొబైల్‌ ఫోన్‌లు తదితరాలకు సంబంధించి పోలీస్‌ దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

 

 

ఏదైన అనుకోని సంఘటనలు, ప్రమాదాలు జరిగిన సమయాల్లో సంప్రదించాల్సిన టోల్‌ ఫ్రీ నంబర్ల వివరాలు కూడా ఈ యాప్‌లోఉన్నాయి. పోలీస్‌ సేవల కోసం డయల్‌ 100, అత్యవసర సేవలకు 112, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098, టూరిస్ట్‌ హెల్ప్‌లైన్‌ 1363, ఉమెన్‌ హెల్ప్‌లైన్‌ 181, అంబులెన్స్‌ సేవలకు 108, ఫైర్‌ సర్వీస్‌కు 101, రోడ్డు ప్రమాదాల్లో అత్యవసర సేవలకు 1073, సైబర్‌ మిత్ర సేవల కోసం 9121211100కి డయల్‌ చేయవచ్చు. దీని ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న నేరాలను అరికట్తే దిశగా ప్రభుత్వం యోచిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: