శనివారం విజయసాయిరెడ్డి పార్టీ నేతలకు ఒక వార్నింగ్ ఇచ్చారు. వైఎస్సార్‌ సీపీ పార్టీకి విధేయత, క్రమశిక్షణ ముఖ్యమని, ఎవరు గీత దాటినా సహించే ప్రసక్తే లేదని విజయసాయి స్పష్టం చేశారు. సమస్యలుంటే పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకురావాలని.. మీడియా ముందుకు తీసుకువస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. పార్టీలో ఎంతటి వారైనా గీత దాటితే చర్యలు తప్పవన్నారు.

 

అయితే విజయ సాయి రెడ్డి వార్నింగ్ ఎవరిని ఉద్దేశించి అన్నది మాత్రం అప్పటికి తెలియలేదు. ఇటీవలే వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరులో మాఫియా విజృంభించంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో ఆనం ను ఉద్దేశించే విజయసాయిరెడ్డి ఈ కామెంట్ చేశారన్న వాదన వినిపించింది. అయితే మరోవైపు ఎంపీ రామకృష్ణంరాజు వ్యాఖ్యలపై కావచ్చని మరికొందరు భావించారు. అయితే సాయంత్రానికే ఈ విషయంపై జగన్ తేల్చేశారు.

 

మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి షోకాజ్ ఇవ్వాలని జగన్ ఆదేశించడంతో విజయసాయి రెడ్డి వార్నింగ్ ఆనం కేనని అర్థమైపోయింది. అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా జగన్ పార్టీ నేతలకు సూచించారు. ఇంతకీ ఆనం ఏమన్నారు..? నెల్లూరులో ఎక్కడ చూసినా మాఫియా రాజ్యమేలుతోందన్నారు ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరు నగరం మాఫియాకు అడ్డాగా మారిందన్నారు.

 

 

నెల్లూరులో కబ్జాదారులు, గ్యాంగ్ స్టర్లు , ఇసుక, బెట్టింగ్ మాఫియాలు విజృంభిస్తున్నాయన్నారు. స్వచ్ఛమైన తేనె కావాలంటే వెంకటగిరి అడవికి వెళ్లాలని, మాఫియా కావాలంటే నెల్లూరులో దొరుకుతారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలే జగన్ కు కోపం తెప్పించాయి. వ్యక్తిగత ఆధిపత్యం ప్రదర్శిస్తే వేటు తప్పదని జగన్ వార్నింగ్ ఇచ్చారు. మొత్తం మీద జగన్ షోకాజ్ నోటీసుతో వైసీపీలో ఆనం ప్రస్తానం ముగినట్టేనా..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: