హైదరాబాద్ షాద్నగర్ లో అమాయకపు వైద్యురాలైన దిశను నలుగురు నిందితులు అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన విషయం తెలిసిందే. దిశా ఘటన ఒక్కసారిగా దేశం మొత్తం వ్యాపించి... దేశం మొత్తం దిశా ఘటనపై స్పందించిన నిరసనలు తెలిపిన తెలిపింది. డిల్లీ లో జరిగిన నిర్భయ ఘటన తర్వాత దేశం మొత్తానికి చేరిన ఘటన ఇదొక్కటే. ఎట్టి పరిస్థితుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడాలంటు  డిమాండ్ చేసింది దేశ ప్రజానీకం. నిందితులకు ఉరిశిక్ష వేసి మరోసారి ఆడపిల్లలపై అఘాయిత్యాలు చేయాలి అంటేనే  భయపడాల్సిన పరిస్థితి తేవాలంటూ నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు దిశ కేసులోని నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేసి చంపారు . 

 

 

 

 ఈ నెల 4న పోలీసులు దిశా కేసులో నిందితులను పోలీస్ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. నలుగురు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపేశారు. కేసు రీ కన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నలుగురు నిందితులు తమపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించరాని  తమ వద్ద ఉన్న  తుపాకుల లాక్కొని తమాపై  దాడి చేయాలని ప్రయత్నించారని అందువల్లే నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేయక తప్పలేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్... నలుగురు నిందితుల ఎన్కౌంటర్పై వివరణ ఇచ్చారు.కాగా  నలుగురు రేపిస్టులను ఎన్కౌంటర్ చేయడంపై దేశవ్యాప్తంగా హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. ఆడ పిల్లపై అత్యాచారాలు చేసే నిందితులకు  సరైన శిక్ష పడింది అంటూ అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

 

 

 అయితే దిశ అత్యాచార నిందితులకు పోస్టుమార్టంలో కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. అయితే కాల్పులు జరిపి ఎన్కౌంటర్ చేసినప్పుడు నలుగురు నిందితుల బాడీలో మొత్తం 12 బుల్లెట్టు తగిలినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఆ నలుగురు నిందితులు శరీరాలు పోస్టుమార్టం చేసే సమయంలో మాత్రం బాడీలో ఒక్క బుల్లెట్ కూడా కనిపించలేదని సమాచారం. పోలీసులు ఎన్కౌంటర్ చేసినప్పుడు బుల్లెట్లు నిందితుల శరీరాలను చీల్చుకొని బయటకు వెళ్ళినట్లు భావిస్తున్నారు. అయితే ఈ పోస్టు మార్టం పై స్పందించేందుకు మాత్రం పోస్టుమార్టం చేసిన వైద్యులు మాత్రం నిరాకరించారు. 

 

 

 

 ఇదిలా ఉండగా ఈ కేసులో నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన ఘటనపై కొంతమంది మాత్రం నెగిటివ్గా స్పందిస్తున్నారు. చట్ట ప్రకారం ముందుకు వెళ్లి ఉంటే బాగుండేదని ఎన్కౌంటర్ చేయడం సరైన పద్ధతి కాదంటూ చెబుతున్నారు. అటు నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య కూడా ఒక ఆడపిల్ల కోసం తన భర్తను ఎన్కౌంటర్ చేయడం దారుణమని... ఎన్కౌంటర్ చేసినట్లుగానే దేశంలో ఇప్పటివరకూ జరిగిన అత్యాచారాల నిందితులను ఎన్కౌంటర్ చేయాలని లేకపోతే తనను  కూడా తన భర్తతో పాటు చంపేయాలని డిమాండ్ చేస్తోంది. నిన్న మానవ హక్కుల కమిషన్ ఎన్కౌంటర్ జరిగిన స్థలాన్ని పరిశీలించి పోలీసులను  పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: