తెలంగాణలో జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు గవర్నర్ ను కోరారు. రాజ్ భవన్ సాక్షిగా తమకు అన్యాయం జరిగిందని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు అలిగారు. రాజ్ భవన్ కు రమ్మని చెప్పి.. చివరకు జాబితాలో పేర్లు లేకుండా చేశారని అవమానంగా ఫీలయ్యారు. 

 

కాంగ్రెస్ అంటే.. కాంగ్రెస్ అన్నట్టు వ్యవహరిస్తున్నారు నాయకులు. రాజ్ భవన్ కి వెళ్లి రాష్ట్రంలో మద్య నియంత్రణ, బెల్ట్ షాపుల పై చర్యలు తీసుకోవాలని గవర్నర్ కి వినతి పత్రం ఇచ్చారు. అయితే... పార్టీ సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, హనుమంతరావులు అందరికంటే ముందే రాజ్ భవన్ కి వచ్చారు. అరగంటలో రాజ్ భవన్ నుంచి బయటకు వచ్చారు. పార్టీ నాయకులు... ఢిల్లీలో ఉన్న మమ్మల్ని రాజ్ భవన్ కి వెళ్ళాలి రండి అని పిలిచి ...గవర్నర్ ని కలిసే జాబితాలో పేర్లు లేకపోవడం ఏంటని పొన్నాల, వీహెచ్ అసహనానికి గురయ్యారు. పార్టీలో బీసీ నాయకులను అవమానిస్తున్నారు అని చెప్పడానికి ఇంతకు మించి కారణం ఏం కావాలని ప్రశ్నించారు హనుమంతరావు. 

 

సీనియర్లు పొన్నాల, వీహెచ్ బయటికొచ్చాక.. కాంగ్రెస్ ముఖ్య నేతలు గవర్నర్ ను కలవడానికి వచ్చారు. అరగంటకు పైగా గవర్నర్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొని ఉన్న సమస్యలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వివరించారు. ఇదే సందర్భంగా బెల్ట్ షాపుల గురించి భట్టి చెప్తుండగా... బెల్ట్ షాప్ లు అంటే ఏంటి..?  అని గవర్నర్ భట్టి ని అడిగారు. మహిళపై జరుగుతున్న దాడుల సమాచారం ఇస్తుండగా...  ఆ సమాచారం తనకుందని గవర్నర్ చెప్పారు. 

 

రాష్ట్రంలో మహిళల పై జరుగుతున్న నేరాలు అరికట్టాలని, మద్యం అమ్మకాలు కంట్రోల్ చేయాలని గవర్నర్ తమిళసై ని కాంగ్రెస్ బృందం కోరింది. ప్రజల భద్రత కోసం వినియోగించాల్సిన పోలీసు యంత్రంగాన్ని  తెరాస నేతల కోసమే వాడుతున్నారని ఆరోపించారు. దిశ కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. మద్యం అమ్మకాలు నియంత్రించాలని గవర్నర్ ని కోరింది కాంగ్రెస్ బృందం. సీనియర్లు మాత్రం ..పార్టీ నాయకుల తీరును తప్పుపట్టి... రాజ్ భవన్ నుండి బయటకు వెళ్లిపోయారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: