కోర్టులు అప్పుడప్పుడు సంచలన తీర్పు వెలువరిస్తూ ఉంటాయి. గతంలో సుప్రీంకోర్టు కూడా పలు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఒక అబ్బాయి అమ్మాయి లివింగ్ రిలేషన్ షిప్ తప్పు కాదంటూ తీర్పును వెలువరించింది సుప్రీంకోర్టు. అంతేకాకుండా ఇద్దరు ఇష్టప్రకారం చేసే శృంగారం అసలు తప్పు కాదని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఇలాంటి వాటిలో ఎలాంటి కేసు నమోదు చేయడానికి వీలులేదని తెలిపింది. అయితే ప్రస్తుతం లివింగ్ టుగెదర్ ట్రెండు రోజురోజుకు ఎక్కువైపోతున్నది . ఎక్కడ చూసినా లివింగ్ టుగెదర్ కపుల్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఇక పెళ్లి కాకుండా ఒక ఆడ మగ ఇష్టం తో సహజీవనం చేస్తే తప్పు కాదని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో ఇక చాలామంది సహజీవనం చేసే వాళ్ళ సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. 

 

 

 ఇదిలా ఉండగా అటు చాలామంది ప్రేమికులు కూడా ఎక్కువగా లాడ్జీలు ఆశ్రయిస్తూ రొమాన్స్ లో మునిగి తేలుతున్నారు. అయితే ఎక్కువమంది లవర్స్ లాడ్జిలో రూమ్ లో అద్దెకు తీసుకుని రొమాన్సులు  చేస్తుండడంతో పోలీసులు రైళ్లలో దొరికిపోతున్నారు. పోలీసుల రైళ్లలో దొరకకపోవడంతో కటకటాల పాలవుతున్నారు ప్రేమికులు. కొన్ని కొన్ని సార్లు పోలీసులు అటు లాడ్జీలు కూడా సీల్ చేస్తున్నారు. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. పోలీసులు ఓ లాడ్జి పై రైడ్  నిర్వహించారు. అయితే ఆ లాడ్జిలో   ఇద్దరు ప్రేమికులు ఒకే గదిలో ఉండడంతో వారిని అదుపులోకి తీసుకొని ఆ లాడ్జిని  సీజ్ చేశారు పోలీసులు. 

 

 

 

 అయితే దీనిపై లాడ్జి యజమాని... కోర్టును ఆశ్రయించగా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. పెళ్లి కానీ ఆడ మగ ఒకే గదిలో ఉండటం నేరంగా పరిగణించాలని  చట్టంలో ఎక్కడ పొందుపరచ లేదని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. సహజీవనాన్ని ఎలా నేరంగా పరిగణించలేమో.. పెళ్లి కానీ ఇద్దరు ఆడ మగ ఒకే గదిలో ఉండడాన్ని కూడా నేరంగా పరిగణించే లేమంటూ  మద్రాస్ కోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు లాడ్జి సీల్  ను తొలగించాలని అధికారులను ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: