మన దేశంలో ఉన్న స్వాములు మనుషుల్లో వీక్‌నెస్‌ని క్యాష్ చేసుకుంటూ... స్వయంగా దేవుళ్లం అని చెప్పుకుంటూ ఉంటున్నారు. అందులో నిత్యానంద ఒకరు. ఓవైపు కర్ణాటక కోర్టులో నిద్యానందపై క్రిమినల్ కేసులు కొనసాగుతుంటే... ఆ మహానుభావుడు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమాయకుల్ని తన భక్తులుగా చేర్చుకుంటూ బిజినెస్‌ను పెంచుకుంటున్నాడు.

 

 

ఇండియాతోపాటూ... విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో డొనేషన్లు ఇస్తూ... అతన్ని దేవుడిగా మార్చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో రావడం... నిత్యానంద ఆశ్రమానికి వెళ్లడం, ఆయన చెప్పింది వినడం... ఆ తర్వాత ఆయన భక్తులుగా మారిపోయి... అన్నీ సమర్పించుకోవడం సహజమైపోతోంది. ఇటీవల నిత్యానంద ఆశ్రమ సిబ్బంది... యువతుల్ని బలవంతంగా వ్యభిచార కూపంలోకి లాగేందుకు చేసిన ఘనకార్యాలు వెలుగులోకి రావడంతో... ఒకప్పటి నిత్యానంద భక్తులు ఇప్పుడు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

 

ఇకపోతే ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకొని... రేపులు, అరాచకాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద ఇప్పుడు ఎక్కడున్నాడు? రేపు ఎక్కడుంటాడు? ఈ ప్రశ్నలకు సమాధానం పోలీసుల దగ్గర లేదు. ఇక ఈయనమీద మరో ఇప్పుడు మరో వార్త చక్కర్లు కొడుతుంది. అదేమంటే ఈక్వెడార్‌ లో ఓ దీవిని కొనేసి, కొత్త దేశం క్రియేట్ చేసినట్లు చెప్పుకున్న నిత్యానందకు... అంత సీన్ లేదనీ, అసలు తాము ఏ దీవినీ నిత్యానందకు అమ్మలేదని ఈక్వెడార్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు... ఆశ్రయం కోసం నిత్యానంద చేసుకున్న శరణార్థి దరఖాస్తును తిరస్కరించింది.

 

 

వెంటనే నిత్యానంద అజ్ఞాతంలోకి చెక్కేశాడు. తాజాగా ఆయన మాట్లాడుతున్న ఓ వీడియో రిలీజైంది. అందులో... నిత్యానంద చెప్పిన మాటలు విని... ఆయనకు పిచ్చి బాగా ముదిరిందనీ, వెంటనే ఎవరికైనా చూపించాలని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇంతకీ నిత్యానంద ఏం స్పీచాడన్నదేగా మీ డౌట్. ఇలా అన్నాడు. "నన్ను ఎవ్వరూ టచ్ చేయలేరు. ఏ స్టూపిడ్ కోర్టూ నన్ను ప్రాసిక్యూట్ చేయలేదు. నేను పరమశివుడిని. నేను నిజం చెప్పగలను.

 

 

మీ ముందు నా నిజాయితీని నిరూపించుకోగలను" అని తన ముందు ఉన్న అనుచరులతో నిత్యానంద మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అయ్యింది. ఇకపోతే కలికాలం అంటే ఇదే అంటారు. దొంగలు రాజులవుతారు. రాజులు దొంగలు అవుతారు అని అంతా అనుకుంటున్నారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: