కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్‌) డైరెక్టర్  శేఖర్ మాండే జనరల్ విజయవాడలో ఒక ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యారు. శేఖర్ మాండే మీడియాతో మాట్లాడుతూ దేశంలో ప్రజలు ఎదుర్కొంటోన్న అనేక సమస్యలకు పరిష్కారాలకు కనుగొనడానికి సీఎస్‌ఐఆర్‌ ఆధ్వర్యంలో 38 పరిశోధన సంస్థలు పని చేస్తున్నాయని చెప్పారు. ఈ 38 పరిశోధన సంస్థల్లో వివిధ రంగాలకు చెందిన 4,500 మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూ ఉంటారని అన్నారు. దేశానికి పలు రంగాల్లో అవసరమైన పరిశోధన ఫలితాలు అందించటానికి నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. 
  
ప్రపంచంలో మన దేశ ప్రజల్లో ఉన్న వైవిధ్యం మరెక్కడా లేదని శేఖర్ మాండే అన్నారు. బయో ప్యూయల్ కు దేశానికి ఇంధన భద్రతను అందించే శక్తి ఉందని అన్నారు. కానుగ నుండి బయో ప్యూయల్ ను తయారు చేస్తున్నామని ఇతర ప్రత్యామ్నాయ వనరుల నుండి కూడా బయో ఫ్యూయల్ తయారు చేయవచ్చని చెప్పారు. బయో ప్యూయల్ ను ఉత్పత్తి చేయటం ద్వారా ఇంధన దిగుమతుల భారం తగ్గుతుందని అన్నారు. 
 
ప్లాస్టిక్ నుండి డీజిల్ తయారీ ప్రయోగం విజయవంతమైందని అన్నారు. ఇంధన కొరతను, ప్లాస్టిక్ సమస్యను అధిగమించడానికి ప్లాస్టిక్ నుండి డీజిల్ తయారీ ప్రయోగం ఉపయోగపడుతుందని అన్నారు. దేశంలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానం పట్ల ఆసక్తి చూపిస్తున్నాయని అన్నారు. ప్లాస్టిక్ సమస్యను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్లాస్టిక్ నుంచి డీజిల్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయటం ద్వారా అధిగమించవచ్చని తెలిపారు. 
 
తేలికపాటి విమానాల తయారీ కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్, నేషనల్ ఏరోనాటిక్స్ తో కలిసి పరిశోధనలు చేస్తున్నామని 19 సీట్లతో తయారు చేసిన సరస్ విమానం సిద్ధమైందని తెలిపారు. 70 సీట్ల విమానం కూడా ఆమోదం పొందిందని అన్నారు. అల్జీమర్స్ వ్యాధికి కుంకుమ పువ్వు నుండి మందు తయారు చేశామని ప్రభుత్వానికి క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి కొరకు విజ్ఞప్తి చేశామని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: