ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమను మించినది ఏది లేదంటారు. బిడ్డలు ఏం చేసిన వారి మీద అమ్మకు ఉన్న విపరీతమైన ప్రేమ ఆమె తుది శ్వాస విడిచే వరకు అలానే ఉంటుంది. కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఈ ఒక్క అమ్మ విషయంలో తప్ప. పుట్టిన బిడ్డ ఆకలిని చనుబాలతో తీర్చిన ఈ అమ్మ... 15 ఏళ్లు గడిచిన తర్వాత ఆ బాలికనే మృగాల ఆకలికి బలి చేయాలనుకుంది. దీంతో... మాతృత్వానికే కాదు మానవ జాతికే ఒక మాయని మచ్చగా నిలిచింది ఈ ఘటన.

వివరాల్లోకి వెళితే.. విజయవాడ మొగల్రాజపురం ప్రాంతానికి చెందిన దంపతులకు ఓ కుమార్తె (15)  ఉంది. అయితే వివాహమైన కొన్ని సంవత్సరాల తర్వాత ఈ దంపతుల మధ్య తీవ్రమైన మనస్పర్థలు వచ్చి విడిపోయారు. దాంతో... తండ్రి కూతురు కలసి బాలిక వాళ్ళ నాయనమ్మ ఇంటికి వెళ్లి నివాసముంటున్నారు. అయితే బాలిక వాళ్ల తాతయ్య కొద్దినెలలుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. కొన్ని రోజుల క్రితం తన తాతయ్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో... అతనిని బంధువులు సికింద్రాబాద్ ఆస్పత్రికి తరలించారు. అయితే బాలిక తండ్రి కూడా సికింద్రాబాద్ కి వెళ్ళాడు. కానీ వెళ్లేటప్పుడు తండ్రి బాలికను తల్లి దగ్గర 15 రోజులు ఉండమని విడిచి వెళ్ళాడు.



ఈ క్రమంలోనే తల్లిలోని కర్కశత్వం బయటపడింది. ఈ తల్లి ఒకరితో కాదు ఏకంగా ఇద్దరితో (రమేష్‌, సాగర్‌) చనువుగా ఉంటుంది. కూతురు ఇంటికి వచ్చేసరికి... ఆమెలోని నీచత్వం బయటపడి తాను చనువుగా ఉండే ఇద్దరిని బాలికతో అసభ్యంగా ప్రవర్తించమని చెప్పింది. ఒకరోజు తల్లీకూతుళ్లను కారులో ఎక్కించుకొని సాగర్ బయల్దేరాడు. అయితే కొంత దూరం వెళ్లిన తర్వాత తల్లి కారు నుంచి దిగిపోయి... తన కూతురుని సాగర్ కు అప్పగించి పంపించేందుకు ప్రయత్నించింది. కానీ బాలిక గట్టిగా ఏడవడం తో అక్కడ ఉన్న స్థానిక ప్రజలు బాలికను కారు నుంచి దింపి కాపాడారు. మరుసటి రోజు తన కూతురు స్నానం చేసేటప్పుడు... తల్లి దొంగ చాటుగా ఉండి ఫోటోలు తీసింది.. ఆ తర్వాత కూతురు బట్టలు మార్చుకునేటప్పుడు కూడా ఫోటోలు తీసి సాగర్ రమేశ్ లకు పంపించింది. దాంతో ఇద్దరూ ఆ ఫోటోలని అడ్డుపెట్టుకొని బాలికను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. అయినా బాలిక ఒప్పుకోకపోవడంతో... తండ్రిని చంపుతామని బెదిరించారు.

తర్వాత తండ్రి రాగానే తనకు జరిగిందంతా చెప్పి బోరున విలపించింది. దాంతో తండ్రి బాలికను శనివారం మాచవరం పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించారు. తల్లితో పాటు... ఇద్దరు వ్యక్తులపై పోలీసులు పలు సెక్షన్ల కింద, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: