అత్యాచారం ఇప్పుడు ఈ పదం వింటే చాలు షాద్ నగర్ వెటర్నరీ వైద్యురాలు దిశ కేసు ఏ గుర్తస్తుంది. అంత అమానవీయంగా జరిగింది ఆ ఘటన. పని ఉండి బయటకు వెళ్లిన ఆ అమ్మాయిని నలుగురు లారీ డ్రైవర్లు కలిసి సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి పెట్రోల్ పోసి ఆమె శవాన్ని ముట్టుకొనేకి కూడా లేకుండా పెట్రోల్ పోసి కాల్చిపడేశారు ఆ నీచులు. 

 

అయితే ఆ నీచులు కూడా సిన్ రికర్రెక్షన్ చేస్తున్న సమయంలో ఆ నిందితులు పారిపోవాలని చూసి పోలీసులపై దాడి చెయ్యడం వల్ల పోలీసులు ఆత్మరక్షణ కోసం ఆ నిందితులపై కాల్పులు జరిపారు. దీంతో ఆ నిందితులు నలుగురు నిన్న తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు మృతిచెందారు. 

            

అయితే ఈ ఎన్కౌంటర్ జరిగినప్పటికీ ఆ మృతుదేహాలు పోస్ట్ మార్టం అనంతరం స్వగ్రామానికి తీసుకెళ్తుండగా అక్కడ అంత్యక్రియలకు కూడా స్థలం లేదు ఆ నిందితులకు. అయితే అప్పటికే ఆ నిందితుల ఎన్కౌంటర్ పై కోర్టులో పిటిషన్ నమోదు అవ్వగా వారి అంత్యక్రియలకు బ్రేకులు పడ్డాయి. 

 

వారి మృతుదేహాలను సోమవారం సాయింత్రం వరుకు భద్రపరచాలి అని ఆర్డర్స్ వచ్చాయి. అయితే మొదట పోస్ట్ మార్టం నిర్వహించగా ఆ పోస్టుమార్టం రిపోర్టు ఆలస్యంగా తెర మేధకు వచ్చింది. కాల్పులు జరిపినప్పుడు నిందితుల శరీరాల్లో మొత్తం 12బులెట్లు దిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే వారి శరీరాలకు పోస్టుమార్టం చేసే సమయంలో ఒక్క బులెట్ కూడా కనిపించలేదని సమాచారం. 

 

దీంతో బులెట్లు నిందితుల శరీరాలను చీల్చుకొని బయటకు వచ్చాయా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ నిందితుల పోస్టుమార్టంపై స్పందించేందుకు వైద్యులు నిరాకరించారు. కాగా దిశ అత్యాచార నిందితులు కుక్క చావు చచ్చిన సంగఠీ తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: