దిశ హత్య కేసులోని నిందితుల ఎన్ కౌంటర్ విషయాన్ని ఇప్పుడు మానవ హక్కుల సంఘాలు మరియు కోర్టు వారు చాలా సీరియస్ గా తీసుకున్నారు. పోలీసులు ఎన్కౌంటర్ చేసిన తీరుపై సర్వత్రా విమర్శలు నిదానంగా వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. వారు ఈ ఎన్ కౌంటర్ కి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ విచారణలో ఒక నివేదికను సమర్పిస్తారు. అయితే ఇందులో భాగంగా కొన్ని నమ్మలేని నిజాలు బయటకు వస్తుండటం ఇప్పుడు రాష్ట్రంలోని ప్రజలు అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

 

అసలు విషయానికి వస్తే దిశ హత్య కేసులోని నలుగురు నిందితులను కోర్టు ముందు ప్రవేశ పెడితే వారికి కోర్టు వారు శిక్ష విధించేందుకు తగిన ఆధారాలు కావాలి. అమ్మాయి చనిపోయి ఉంది కాబట్టి బాధితురాలి వాంగ్మూలం ఇక్కడ లభ్యం కాదు. వారు అమ్మాయిని రేప్ చేసినపుడు కానీ లేదా కాల్చేస్తున్నప్పుడు గానీ తమ కళ్ళతో చూసిన ప్రతి ప్రత్యక్ష సాక్షులు కూడా ఎవరు లేరు. ఇంకా వారి వీర్యం లేదా మరియు వారి డీఎన్ఏను చెప్పే ఒకే ఒక్క ఆధారమైనా ఆమె శరీరంపై దొరుకుతుంది అనుకుంటే వారు అలాంటి వాటికి వేటికీ ఆస్కారం లేకుండా పెట్రోల్ పోసి శరీరాన్ని కాల్చి బూడిద చేశారు.

 

ఇక ఇలాంటి పరిస్థితుల్లో పోలీసు వారు ఇచ్చిన ఆధారాలను కూడా కోర్టు వారు పరిగణించరు. కావున నిందితులు ఈ కేసు నుండి తప్పించుకోవడం లేదా ఉరిశిక్ష కాకుండా ఏదైనా యావజ్జీవ కటిన కారాగార శిక్ష లాంటి తక్కువ మోతాదులోని శిక్షలతో తప్పించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అదే కనుక జరిగి ఉంటే రాష్ట్రం అల్లకల్లోలం అయి ఉండేది. మొత్తంగా భారత దేశ న్యాయ వ్యవస్థ పైనే ప్రజలకు వ్యతిరేకా భావం రావడం ఏ దేశానికైనా ప్రమాదం కాబట్టి ప్రభుత్వం వెంటనే దానికి పరిష్కారంగా నిందితులను ఎన్ కౌంటర్ పేరుతో హతమార్చినట్లు మానవ హక్కుల సంఘాల తో సహా పలువురు ఆరోపిస్తున్నారు. చూద్దాం దీని పై కమిటి చివరికి ఏం నివేదిక ను ఇస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: