మనుషులకు మనుషులకు మధ్య దూరం పెరిగిపోతుందన్న విషయం కొన్ని కొన్ని సంఘటలను చూస్తే అర్ధం అవుతుంది. లోకంలో మనిషి ప్రాణాలు అంటే విలువ లేదు. జంతువులను బలి ఇచ్చినట్లుగా మనుషుల ప్రాణాలు తీస్తున్నారు కొందరు. ఇకపోతే కేవలం డబ్బులు బాకీ ఉన్నాయన్న నెపంతో మాట మాట పెరిగి ఓ మనిషి ప్రాణం తీసుకునే వరకు వెళ్లింది. వివరాలను పరిశీలిస్తే.

 

 

మిర్జా ముబీనుద్దీన్‌(32 రాజేంద్రనగర్‌ పరిధిలోని శాస్త్రిపురం కింగ్స్‌ కాలనీలో ఉంటున్నాడు. భవానీనగర్‌కు చెందిన రెహ్మాన్‌తో కొంతకాలంగా పరిచయం ఉంది. ఈ క్రమంలో ఓ వాహనం కొనుగోలు విషయంలో రెహ్మాన్‌ దగ్గర మిర్జా ముబీనుద్దీన్‌ రూ.35 వేలు బాకీ తీసుకున్నాడు. ఈ దశలో మిర్జా ముబీనుద్దీన్‌ పై రెహ్మాన్‌ తన అప్పు తీర్చాలంటూ నాలుగు రోజులుగా ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి.

 

 

ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 8.30 గంటల ప్రాంతం లో పధకం ప్రకారం అతన్ని పిలిపించుకుని  ముబీనుద్దీన్‌ పై దాడికి దిగారు. ఈక్రమంలో రెహ్మాన్‌, మిగిలి ఇద్దరు మిర్జాపై పిడిగుద్దులు కురిపించారు. అతడిని నడిరోడ్డుపై పరుగెత్తిస్తూ కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశారు. గొంతు కోసేందుకు యత్నించగా మిర్జా వారిని నెట్టేశాడు. దీంతో వారు అతడిని కాళ్లతో తంతూ తీవ్రంగా గాయపరచారు.

 

 

ఇక నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటనతో భారీగా ట్రాఫిక్ నిలిచి పోవడంతో సమాచారం అందుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు వెంటనే అక్కడికి చేరుకునే సరికి నిందితులు పారిపోయారు. ఇక బాధితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఫలక్‌నుమా డివిజన్‌ ఏసీపీ మహ్మద్‌ మజీద్‌, చాంద్రాయణగుట్ట డీఐ కె.ఎ.ప్రసాద్‌వర్మ, ఎస్సైలు ఎస్‌.వెంకటేష్‌, షేక్‌ జకీర్‌ హుస్సేన్‌లు పరిశీలించారు. ఇకపోతే వృత్తి రీత్యా కారు డ్రైవర్‌ అయిన రెహ్మాన్‌ పవర్‌ గ్యాంగ్ పేరుతో ఓ ముఠా నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: