దిశ హత్య కేసులో నిందితులను హైదరాబాద్ పోలీసులు అత్యంత నాటకీయత తరహాలో హతమార్చిన విషయం తెలిసిన తరువాత దేశమంతా సంబరాలు జరుపుకుంది. అయితే చనిపోయిన వారి కుటుంబ సభ్యులు మాత్రం తమకు న్యాయం జరగాలంటూ రోడ్లపైకి ఎక్కగా పోలీసు వారు కూడా ఎన్ కౌంటర్ పై సరైన వివరణ ఇవ్వలేక దీనిపై విచారణకు ఏర్పాటు చేసిన కమిటీ వల్ల తీవ్ర ఒత్తిడిలో పడ్డారు. అయితే అసలు ఈ రచ్చ అంతా లేవడానికి కారణం వేరే వారు ఉన్నారని అంతా అనుకుంటున్నారు. అతనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు.

 

ముందు దిశ మీద అత్యాచారం మరియు హత్య జరిగిన సమయంలో దేశంలోని ప్రముఖులంతా వెంటనే స్పందిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అదే సమయంలో ఆర్టీసీ కార్మికుల విషయంలో కొంచెం గందరగోళంలో ఉండి దానిపై వెంటనే స్పందించలేదు. అయితే వారి విషయం ఒక కొలిక్కి వచ్చాక దిశ కేసు పై దృష్టి సారించిన ఆయన పోలీసు అధికారులకు పూర్తి పవర్స్ ను ఇచ్చేశారట. అమ్మాయికి న్యాయం జరిగేందుకు వారిని ఎంత దూరమైనా వెళ్ళమని ఆదేశించిన కేసీఆర్ కు బయటనుండి వారికి వెంటనే ఉరిశిక్ష వేయాలని వస్తున్న ఒత్తిడి వల్ల ఒక సంచలన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందట.

 

ఎప్పటిలాగా కాకుండా వీలైనంత త్వరగా నిందితులు నలుగురిని కోర్టు ముందు హాజరు కావలసిందిగా పోలీసు వారిని కేసీఆర్ ఆదేశించారు. అయితే కోర్టు ముందు ప్రవేశ పెట్టేందుకు తగిన ఆధారాలు కోసం నిందితులు నలుగురిని తీసుకొని ఎవరూ లేని సమయంలో అర్ధరాత్రి సమయంలో పోలీసువారు అక్కడికి వెళ్లగా అక్కడ నిందితులు వారి తుపాకులను కాజేసి పోలీసులపై కాల్పులు జరిపి రాళ్లతో, కర్రలతో దాడి చేసినట్లు పోలీసులు చెప్పారు. దీంతో వారి ఆత్మ రక్షణ కోసం నిందితులను ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. అయితే ఇది ఎన్కౌంటరా లేక చక్కగా ప్లాన్ చేసిన హత్యా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: