రఘురామ్‌రాజన్‌ అనగానే గుర్తుకొచ్చేది ఆర్బీఐ మాజీ గవర్నర్ అని మంచి ఆర్థిక వేత్త అని ఎవరిని అడిగిన చెప్తారు.ఇతడు దేశ ఆర్థిక వ్యవస్థపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకునే రోజుల్లో  మోదీ ప్రభుత్వానికి ఎప్పుడు వద్దని సలహా ఇచ్చారు కానీ ప్రభుత్వం అతడు ఇచ్చిన సలహాని తొకైపుచిన ప్రభుత్వం అతడి మాటను కాదని నిర్ణయం తీసేసుకోవడం తో నిరాశ చెంది ఆర్బీఐ కి రాజీనామా చేసాడు. 

అప్పటి తరువాత ఇప్పుడూ  మళ్ళీ ఆర్థిక మాంద్యం దృష్ట్యా  స్పందించారు  దేశంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం, నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభాలను ఎదుర్కోనున్నాయని హెచ్చరించారు. ఇండియా టుడే పత్రికలో ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయని తెలిపారు.  నిరుద్యోగిత రేటు తీవ్ర స్థాయిలో ఉందని తెలిపారు. అలాగే ప్రభుత్వానికి ఆర్బీఐ కి కొన్ని సలహాలు ఇచ్చారు.  కేంద్రం టాప్‌  బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల పనితీరును సమీక్షిస్తుందన్న ఆయన ఆర్‌బీఐ వాటి పనితీరును, వాటి ఎసెట్‌ క్వాలిటీని కూడా సమీక్షించాలని సూచించారు. అలాగే  అతి ముఖ్యమైన పెద్ద ఎన్‌బీఎఫ్‌సీలు కుప్పకూలకుండా ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటుందని ఆయన వివరించారు. మరి ఎం చేస్తుందో చూడాలి.

ఆర్థిక మాంద్యం తో వ్యాపార రంగం కుదేలు కాగా కార్మికులకు పని దొరకక దుర్భర జీవితం గడుపుతున్నారు. అయితే రఘురామ్ రాజన్ ఆర్బీఐ కి రాజీనామా తదనంతరం అమెరికా లో ఒక ప్రముఖ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా అతని సేవలను కొనసాగిస్తున్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తి సేవలను ఇండియా ఉపయోగించు కోకపోవడంతో మన దురదృష్టం అని చర్చించుకుంటున్నారు. అయితే ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్  బ్యాంకింగ్‌ రంగంలో సమస్యలకు యూపీఎ ప్రభుత్వంతో పాటు అప్పటి ఆర్బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌లే కారణమని విమర్శించారు దీనికి  రఘరామ్‌ రాజన్‌ దీటుగా బదులిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: