దిశ హత్య కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేసిన విషయం విదితమే. అయితే చెన్నకేసువులు భార్య మాత్రం తన భర్తను చంపడం తప్పు అంటుంది. ఇతర నిందితులు తన భర్తను తీసుకువెళ్లి మద్యం తాగించి రెచ్చ కొట్టి ఆపై రేప్ చేయించేలా చేశారంట. అయితే ఆమె అమాయకపు భర్తను ఇంటికి పంపిస్తామని పోలీసులు హామీ ఇచ్చారంట. అలా హామీ ఇచ్చి ఇలా చేయడం అన్యాయం అంటూ చెన్నకేశవ భార్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇంకా కొన్ని డిమాండ్లు కూడా అడుగుతుంది. అవేంటో ఒకసారి చూద్దాం.

చెన్నకేశవుల భార్య మాట్లాడుతూ... 'మా ఆయన పోయినోడు పోయిండు... తిరిగి రాడు. ఇప్పుడు నాకు ఆధారం ఏంటి? చెప్పండి! నాకు రూ.10 లక్షలన్న కావాలి, 5 లక్షలన్న కావాలి. అంతే బెడ్ రూమ్ కావాలి నాకు. ఇప్పుడు నా బతుకు ఏంటి? మా అత్త మామ బతుకు ఏంది? మా ఆయన ఉంటే మమ్మల్ని కూర్చోబెట్టి సాదుతుండే.. ఇప్పుడు మా ఆయననే లేడు... ఇప్పుడు మమల్ని ఎవరు సాధేది? ఇల్లు గిట్టలేదు... ఇప్పుడు మొత్తం ఇంటిలోపల కారతది. మా ఆయన తిరిగి రాడు. అత్త ఉంది, మా మామ ఉన్నాడు. రేపోమాపో బిడ్డనో, ఎవరో పుడతారు. మా నాన్న ఏడుండు అంటే ఏం చెప్పాలి? ఇంతగానం హత్య చేయడం చాలా తప్పు. ' అని చెప్పింది.

ఇక ఈ మాటలు విన్న నెటిజన్లు మాత్రం... ' మీ ఆయన పెద్ద దేశభక్తుడా? లేకపోతే దేశ సంరక్షణలో ప్రాణాలు కోల్పోయాడా?ప్రభుత్వం ఎందుకు నష్టపరిహారం ఇవ్వాలి? అని ప్రశ్నిస్తున్నారు. రేపిస్టులకు నష్ట పరిహారం ఇస్తే... నిరుద్యోగులంతా... రేప్ చేసుకుంటూ.. తమ కుటుంబాలకి డబ్బులు సంపాదించి పెడతారు అని కొంతమంది... ఆమెను ఎద్దేవా చేస్తున్నారు. మరొకరేమో... వీళ్ళకి కావాల్సినంత డబ్బులిస్తే... సైలెంటు అయిపోతారని అంటున్నారు. ఏదేమైనా భూమికి భారమైన చెన్నకేశవులు బ్రతుకుంటే... తన భార్య సంపాదించిన డబ్బులు మద్యం కోసం లాక్కొని హింసించేవాడు. అటువంటి భర్తను పోలీసులు ఖతం చేసినందుకు... ఆమెనే పోలీసులకు కృతజ్ఞతలు చెప్పుకోవాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: