దేశ రాజధానైన ఢిల్లీలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఈ అగ్నిప్రమాదంలో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. రాణి ఝాన్సీ రోడ్డులోని అనాజ్ మండిలో గల ఓ భవనంలో అగ్నిప్రమాదం జరిగిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే 43మంది ప్రాణాలు విడచగా 50 మందికి పైగా గాయపడ్డారు. 

 

ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. కాగా క్షతగాత్రులను సమీపంలోని రామ్ మనోహర్ లోహియా, హిందూ రావు  ఆసుపత్రులకు హుటాహుటిన తరలించారు. అయితే ఈ ప్రమాదం పట్ల ప్రముఖ రాజకీయ నాయకులూ అంత తీవ్ర విచారం తెలియజేస్తున్నారు. 

 

ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ అగ్నిప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని తక్షణం సహాయక చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్టు, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నట్టు వారు ట్విట్స్ చేశారు. 

 

కాగా ఈ నేపథ్యంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ ఘటన పట్ల తీవ్ర ద్రిగ్బంత్రిని వ్యక్తం చేశారు. మోడీ ట్విట్ చేస్తూ 'ఇది అత్యంత దురదృష్టకరమైన భయానక ఘటన అని ఓ ట్వీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తాన సంతాపం తెలిపారు. బాధితులకు ఎలాంటి సహాయానికైనా వెనుకాడవద్దని' అధికారులను ఆదేశించారు. కాగా ఈ ఘటన పట్ల ప్రముఖులు అంత కూడా విచారం వ్యక్తంచేస్తున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: