అత్యాచారం ఇప్పుడు ఈ పదం వింటే చాలు షాద్ నగర్ వెటర్నరీ వైద్యురాలు దిశ కేసు ఏ గుర్తస్తుంది. అంత అమానవీయంగా జరిగింది ఆ ఘటన. పని ఉండి బయటకు వెళ్లిన ఆ అమ్మాయిని నలుగురు లారీ డ్రైవర్లు కలిసి సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి పెట్రోల్ పోసి ఆమె శవాన్ని ముట్టుకొనేకి కూడా లేకుండా పెట్రోల్ పోసి కాల్చిపడేశారు ఆ నీచులు. 

 

అయితే ఆ నీచులు కూడా సిన్ రికర్రెక్షన్ చేస్తున్న సమయంలో ఆ నిందితులు పారిపోవాలని చూసి పోలీసులపై దాడి చెయ్యడం వల్ల పోలీసులు ఆత్మరక్షణ కోసం ఆ నిందితులపై కాల్పులు జరిపారు. దీంతో ఆ నిందితులు నలుగురు నిన్న తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు మృతిచెందారు. 

 

అయితే ఈ ఎన్కౌంటర్ పై దేశవ్యాప్తంగా ప్రజలు అంత హర్షం వ్యక్తం చేశారు. అందరూ దిశకు న్యాయం జరిగింది అని ఆనందపడ్డారు. సీపీ సజ్జనార్ ఫోటోలకు పాలాభిషేకం చేశారు. ఇలా ప్రజలంతా ఆనందగా ఉంటె.. రియల్ స్టార్ ఉపేంద్ర ఓ సంచలన ట్విట్ పెట్టి అందరిని ఆలోచించేలా చేసి ప్రస్తుతం విమర్శలకు గురవుతున్నాడు. 

 

రియల్ స్టార్ ఉపేంద్ర ట్విట్ చేస్తూ ''ఆ నలుగురూ ఆమెను హత్యాచారం చేసి కాల్చివేశారో... లేదో..? ఈ సంఘటన వెనుక ఎవరైనా ప్రముఖుల హస్తం ఉందేమో..? ఇదే తరహాలో ఎన్‌కౌంటర్‌లు ప్రముఖ వ్యక్తుల కేసుల్లో ఎందుకు జరగవు..? కోర్టులో విచారణలకు ముందే ఎన్‌కౌంటర్‌ ఇకపై ప్రముఖుల కేసుల్లోనూ రెడ్‌కార్పెట్‌ కానుందా..? ఒకానొక కాలంలో ఎన్‌కౌంటర్‌ను రౌడీయిజం తగ్గించేందుకు సాగేవని, నిజాయితీ పోలీసు అధికారుల మనసు పెడితే ఎన్‌కౌంటర్‌ ద్వారా అత్యాచారాలను నియంత్రించవచ్చునని ప్రముఖులు, శ్రీ మంతులు దుర్వినియోగం చేసుకోకుండా అధికారులు హెచ్చరికగా ఉండాలని'' అంటూ ఉపేంద్ర ట్వీట్‌ చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: