హైదరాబాద్ షాద్నగర్ లో అమాయకపు వైద్యురాలైన దిశను నలుగురు నిందితులు అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన విషయం తెలిసిందే. దిశా ఘటన ఒక్కసారిగా దేశం మొత్తం వ్యాపించి... దేశం మొత్తం దిశా ఘటనపై స్పందించిన నిరసనలు తెలిపిన తెలిపింది. డిల్లీ లో జరిగిన నిర్భయ ఘటన తర్వాత దేశం మొత్తానికి చేరిన ఘటన ఇదొక్కటే. ఎట్టి పరిస్థితుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడాలంటు  డిమాండ్ చేసింది దేశ ప్రజానీకం. నిందితులకు ఉరిశిక్ష వేసి మరోసారి ఆడపిల్లలపై అఘాయిత్యాలు చేయాలి అంటేనే  భయపడాల్సిన పరిస్థితి తేవాలంటూ నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు దిశ కేసులోని నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేసి చంపారు .

 


 అయితే దిశ కేసులోని నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడాన్ని తొలుత సమర్థించిన సిపిఐ సీనియర్ నేత నారాయణ ప్రస్తుతం యు టర్న్ తీసుకున్నారు. అయితే అప్పుడు చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయమని.... ఎన్కౌంటర్లకు తమ పార్టీ పూర్తి వ్యతిరేకం అంటూ సీపీఐ నేత నారాయణ తెలిపారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను అంటూ ప్రకటించారు. ఈ మేరకు గతంలో ఎన్కౌంటర్ సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను అంటూ ఓ వీడియోని విడుదల చేశారు సిపిఐ నేత నారాయణ. 

 


 దిశా  కేసులో నిందితుల పై జరిగిన ఎన్కౌంటర్ పై పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో చర్చించామని సిపిఐ నేత నారాయణ తెలిపారు. అయితే దిశా కేసులో నిందితుల ఎన్కౌంటర్ ను తమ పార్టీ వ్యతిరేకిస్తూ తీర్మానం చేసిందని తెలిపారు. అందువల్లే గతంలో ఎన్కౌంటర్ల సమర్థిస్తూ చేసిన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని  ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా గతంలో తాను చేసిన వ్యాఖ్యల విషయంలో పార్టీకి ప్రజా సంఘాలకు క్షమాపణలు కూడా తెలియజేస్తున్నాను అంటూ సీపీఐ నేత నారాయణ పేర్కొన్నారు. అటు దేశ వ్యాప్తంగా దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్పై భిన్న  అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది దిశా  కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేయడమే సరైన శిక్ష అని అభిప్రాయపడుతుంటే ఇంకొంతమంది శిక్ష విధించడానికి కోర్టులు ఉన్నాయని పోలీసులు నిందితులను ఎన్కౌంటర్ చేయడం ముమ్మాటికి తప్పే అంటూ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: