పెళ్లి అంటేనే నూరేళ్ల జీవితం అంటారు పెద్దలు కానీ ఇష్టం లేని పెళ్లి చేసుకుని బాధపడేకంటే దాన్ని తప్పించుకోవడమే మేలంటారు నేటి యువత. ఇకపోతే కట్టుకునే వాడు ఎలాంటి వాడైన భరించవలసింది అమ్మాయి కాబట్టి ఆమెకు నచ్చకుండా పెళ్లి చేయడం అనేది నేటి కాలంలో కూడా అక్కడక్కడ జరుగుతూనే ఉంది. ఇక ఇక్కడ ఓ జంట పెళ్లిచేసుకున్నారు. ఆతర్వాత వారి కోరికకు తగ్గట్టుగా పెళ్లి జరుగలేదని మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కాని ఆ పెళ్లి పెటాకులై మరొకరొతో పెళ్లి జరిగింది. విచిత్రమైన ఈ సంఘట గురించి తెలుసుకుంటే.

 

 

ఉత్తరప్రదేశ్‌ బిజ్నూర్‌లోని నంగల్జాత్ గ్రామంలో పెళ్లి కొడుకును బంధించి.. వధువు మరో వ్యక్తిని పెళ్లాడిన ఘటన చోటుచేసుకుంది. సినీఫక్కీలో మలుపు తిరుగుతూ వచ్చిన ఈ ఘటనలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి.. అదేమంటే ఆరేళ్ల క్రితం నంగల్జాత్ గ్రామంలో జరిగిన సామూహిక వివాహాల్లో ఓ యువతీ యువకుడు పెళ్లి చేసుకున్నారు.

 

 

అయితే తమ పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలని కలగన్న ఆ వధూవరులకు ఆ పెళ్లి నచ్చలేదు. దీంతో ఆ అమ్మాయి కాపురానికి వెళ్లకుండా పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో ఆరేళ్ల గడిచాక మరోసారి వారిద్దరూ ఘనంగా పెళ్లి చేసుకోవాలని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకు గాను అందరూ పెళ్లి మండపానికి వచ్చిన తర్వాత కట్నం విషయంలో అనుకోని వివాదం తలెత్తింది. మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. దీంతో ఆగ్రహించిన వధువు తరపువారు. పెళ్లికొడుకు, అతడి బంధువులను మండపంలోనే బంధించి, పెళ్లకూతురు కోసం తెచ్చిన బంగారు ఆభరణాలు, చీరలను లాగేసుకున్నారు.

 

 

ఇకపోతే పెళ్లి కుమారుని పట్ల మనసు మార్చుకున్న వధువు ఆ పెళ్లికొడుకును చేసుకోనని చెప్పింది. దీంతో తల్లిదండ్రులు, ఊరి పెద్దలు చర్చలు జరిపి ఆమె పక్కింట్లో ఉండే యువకుడి తో వివాహం జరిపించారు. ఇక ఈ రగడకు కారణం పెళ్లికొడుకు తరపువారు తమ స్థోమతకు మించి కట్నం డిమాండ్ చేశారని, ఆ కోపంతోనే వారిని బంధించినట్లు వధువు బంధువులు చెబుతున్నారు. కానీ ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు పోలీసులకు చేయకపోవడం ఆశ్చర్యం..

 

మరింత సమాచారం తెలుసుకోండి: