జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల్లో భారీ మెజార్టీ సీట్లు గెల్చుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయక పోయినా ప్రతిపక్ష హోదా దక్కించుకుంటుంది అని అందరూ అనుకున్నారు కానీ. ఎవరూ ఊహించని విధంగా జనసేన పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. జనసేనాని రెండుచోట్ల ఓడిపోగా కేవలం ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే స్థానం  మాత్రమే గెలిచింది జనసేన. జనసేన నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యే కాస్త పార్టీ మారాలనుకుంటే ముఖ్యమంత్రి జగన్ తమ పార్టీలోకి రావాలంటే  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న నిబంధన పెట్టడంతో జనసేన తన పార్టీలోనే కొనసాగక  తప్పడం లేదు అన్న వార్తలు కూడా వచ్చాయి. అయినప్పటికీ జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్... జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూనే ఉన్నారు.

 


 గతంలో వైఎస్సార్ వాహన మిత్ర పథకం ప్రవేశ పెట్టినప్పుడు ఏకంగా ఆటోడ్రైవర్ ఖాకీ చొక్కా ధరించి జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్ జగన్ ఫోటో కి పాలాభిషేకం చేయడం సంచలనం గా మారిన విషయం తెలిసిందే. ఇక జగన్ సర్కార్ ప్రవేశపెడుతున్న సరికొత్త పథకాలపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ఇక ఇటీవల వైయస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సీఎం జగన్ తో కలిసి వేదిక పంచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. 

 


 ఓవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇసుక అంశం... రాజధాని మార్పు అంశం... ప్రభుత్వ పాఠశాలలకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం అంశం ఇలా ప్రతి అంశాన్ని తెరమీదకు తెస్తు జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. కాగా  జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్ అసెంబ్లీలో ఏం మాట్లాడబోతున్నారు అనే దానిపై ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ లో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తన పార్టీ అధినేత పవన్ మాటలను వినిపిస్తారా.. లేక మౌనంగా ఉండి పోతారా అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: