మన దేశంలో ఎందరు రాజకీయ నాయకులు మారినా, చట్టాల్లో మార్పులు ఎన్ని విధాలుగా తీసుకువచ్చినా దేశవ్యాప్తంగా ఆడవారి పై అఘాయిత్యాలు మాత్రం తగ్గడం లేదని పలువురు మహిళా మరియు ప్రజా సంఘాల వరకు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన దిశా హత్య  ఘటన నిందితులను మూడు రోజుల క్రితం పోలీసులు ఎన్కౌంటర్ చేయడం జరిగింది. వారిని ఎన్కౌంటర్ చేయడం సరైనదేనని పలువురు ప్రజలు మరియు ప్రజా సంఘాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ ఘటన నిందితులను ఎన్కౌంటర్ చేసిన మాదిరిగానే, 

 

కొద్దిరోజుల క్రితం ఉన్నావ్ లో జరిగిన అత్యాచార ఘటన నిందితులను కూడా ఎన్కౌంటర్ చేయాలని బాధితురాలి కుటుంబసభ్యులు కోరుతున్నారు. ఉన్నావ్ ఘటనలో బాధితురాలిని దారుణాతి దారుణంగా అత్యాచారం చేసిన నిందితులు, అనంతరం ఆమెను కిరోసిన్ పోసి నిప్పంటించారు. కాగా ఆ ఘటనలో 90 శాతానికి పైగా కాలిపోయిన బాధితురాలు నేడు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించింది. ఏకంగా 40 గంటల పాటు మృత్యువుతో పోరాడిన బాధితురాలు నేడు అకాల మరణం చెందడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితురాలి మరణంతో ఆమె కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి. 

 

ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురిని ఈ విధంగా అడ్డగించి అత్యాచారం చేసి, ఆపై చంపేయడం ఎంతవరకు న్యాయం అని, ఈ ఘటనలో తమకు న్యాయం జరిగే వరకు ఊరుకునేది లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా కాసేపటి క్రితం బాధితురాలి మృతదేహాన్ని ఆమె ఇంటికి చేర్చారు, అయితే ఆమె తండ్రి మాత్రం సీఎం యోగి ఆదిత్య నాధ్ వచ్చి తమతో మాట్లాడి, సరైన న్యాయం చేసేవరకు అంత్యక్రియలు జరిపేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. తన బిడ్డ ఆఖరుగా తనకు చెప్పిన మాటలు తనకు ఇంకా గుర్తున్నాయని, ఈ ఘోర కలికి పాల్పడ్డ వారిని శిక్షించేవరకు సహించేది లేదని ఆమె తండ్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: