ఫిలిప్పీన్‌లోని బరంగాయ్ పుంతా ప్రాంతంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పోలీసులకు రోడ్డు పక్కన తలలేని మహిళ శవం పడివుందని సమాచారం అందింది. దీంతో పోలీసులు హుటాహుటిన ఆ ప్రదేశానికి చేరుకుని అక్కడి శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె తల కోసం చుట్టు ప్రక్కల పరిసర ప్రాంతాల్లో వెతికగా వారికి ఆమె తల ఎక్కడా కనిపించలేదు. ఏం చేయాలో తెలియక పోలీసులు శవం పడివున్న ప్రాంతానికి సమీపంలో ఉన్న ఇళ్లకు వెళ్లి ఆ మహిళ ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నించారు. 


కానీ, ఎవ్వరు కూడా ఆమె ఎవరనేది చెప్పలేకపోయారు. పోలీసులకు ఏం చేయాలో అర్ధం కాలేదు. దీంతో ఆ కేసు మిస్టరీగా మారింది. రోడ్డు పక్కనే పడివున్న ఆ మహిళ మృతదేహం అర్థనగ్నంగా ఉంది. శరీరంపై కేవలం డెనీమ్ జీన్స్ ఫ్యాంట్ మాత్రమే ఉంది. స్థానికులు ఆమె ఎవరో తెలియదని చెప్పడంతో పోలీసులు జాగిలాలను రంగంలోకి దించారు. అవి ఘటనా స్థలానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాయిడ్ బాగ్టాంగ్ (21) అనే యువకుడి ఇంటి వద్దకు వెళ్లి ఆగాయి. 


ఆ సమయంలో ఆ ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో పోలీసులు పొరిగింటివారిని ఆరా తీయగా.. అతడు కంగారుగా ఇంటి నుంచి బయటకు వెళ్లడం చూశామని వారు చెప్పారు. పోలీసులకు అతడి పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో పోలీసులు బాగ్టాంగ్ కోసం బరంగాయ్ ప్రాంతమంతా జల్లెడపట్టారు. చివరికి అతనిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ హత్య చేసింది తానేనని ఒప్పుకున్నాడు. 


ఈ సందర్భంగా అతను కొన్ని భయానకమైన నిజాలు చెప్పాడు. హత్య చేసిన యువతి ఎవరో తనకు తెలియదన్నాడు. ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు. ఆమె నాతో ఇంగ్లీషులో మాట్లాడింది. నాకు ఆ భాషంటే కంపరం. అందుకే నేను ఆమెను చంపేశాను. గార్డెన్‌ లోని కత్తెరతో శరీరం నుంచి తలను వేరు చేశాను. ఆ సమయంలో నాకు బాగా ఆకలి వేసింది. దీంతో ఆమె మెదడును తీసి అన్నంతో కలిపి వండుకుని తినేశా. పుర్రెను ఓ గోతిలోకి విసిరేశాను’’ అని తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: