కట్టుకున్న భార్య అంటే పడక గదిలో సుఖాన్ని అందించే పరుపులాంటిదని ఈ మద్యకాలంలో చాలామంది అభిప్రాయ పడుతున్నారు. కొందరికైతే భార్య వంటింటి కుందేలు అనే భావన ఇంకా పోవడం లేదు. పెళ్లి చేసుకుని బంధం ముడి పడ్దాక అన్ని కష్టసుఖాల్లో తోడుంటామని అగ్ని సాక్షిగా హామి ఇచ్చిన మగాళ్లే ఇప్పుడు ఆడదాని పరువును బజార్లో పెడుతున్నారు. సుఖానికే గాని ఆవిడ కష్టాలు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.

 

 

ఇలాంటి సమాజంలో ఎక్కడో ఒకచోట ఒక మంచి భర్త గాని భార్యలు గాని అప్పుడప్పుడు కనిపిస్తుంటారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకుబోయే ఈ జంటను పేర్కొన వచ్చూ. ఇకపోతే కష్ట సుఖాల్లో కలిసి ఉంటానని వేద మంత్రాల సాక్షిగా ప్రమాణం చేసిన వారు. అవగాహన లోపంతో వచ్చే మనస్పర్ధల వల్ల వాదులాడుకుంటున్నారు..

 

 

ఇగోతో ఒకరు. ఒపికలేకమరొకరు. ఇద్దరిమధ్య ఎప్పుడూ గొడవలే. జాబ్ చేస్తున్న దంపతుల మధ్య ఆదిపత్యపోరు. ఇలాంటి చిన్నచిన్న మనస్పర్ధలతో విడాకుల బాటలో ప్రయాణిస్తున్న దంపతులకు నేనే ఆదర్శం అంటున్నాడు చైనాకు చెందిన ఓ భర్త. అందుకు తాను చేసిన పని కనువిప్పు కలిగించేలా ఉంది.. అదేమంటే ప్రెగ్నెంట్ తో ఉన్న తన భార్యను చెకప్ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లాడు  భర్త.

 

 

అప్పటికే ఈ  దంపతులతో పాటు మరికొంతమంది దంపతులు డాక్టర్ కోసం ఆ అస్పత్రిలో ఎదురు చూస్తున్నారు. కనీసం కూర్చోవడానికి కూడా అక్కడ చోటు లేదు. అసలే ఆస్పత్రి, అందులోనూ గర్భిణీ అయిన తన భార్య కూర్చునేందుకు కుర్చీలు లేకపోవడంతో భర్త కుర్చీగా మారాడు.

 

 

పురిటి నొప్పులతో బాధపడుతున్న భార్య బాధను చూడలేని ఆ భర్త కూర్చీగా మారి భార్యను తన వీపుపై కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆమె భర్తపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఇంతమంచి భర్త ఆమెకు దొరికినందుకు మహిళలైతే తెగపొగుడుతున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: