హైదరాబాద్ లో జరిగిన దిశా సంఘటన దేశం మొత్తం  తీవ్ర కలకలంలేపింది ..రెండు రోజుల క్రితమే దిశా నిందితుల ఎం కౌంటర్ జరిగి నిందితులు చని పోయారు .ఈ సంఘటన వాళ్ళ ఇప్పటికే దిశా  కుటుంబం చాల బాధ అనుభవించారు.కానీ దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మరింత విచారణ కోసం బాధితురాలి కుటుంబ సభ్యులను జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ)పిలిచింది .

 

వారి వాంగ్మూలం నమోదు చేసుకొవాలని  పిలిచామని  పోలీసులు చెప్పారు  ఈ మేరకు దిశ సోదరి, తల్లిదండ్రులు ఆదివారం సాయంత్రం రాజేంద్రనగర్‌లోని తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీకి వెళ్లారు.అయితే, ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యుల ముందు విచారణకు హాజరు కావాలని పోలీసులు సమాచారం అందించగా, తొలుత వారు అంగీకరించలేదు . దిశ దశ దిన కర్మ ఉండడమే కాక, ఆమె తల్లి ఆరోగ్యం కూడా సరిగా లేదు అని అందువల్ల  తమను ఇబ్బంది పెట్టవద్దు అంటూ దిశా చెల్లి కోరారు...

 

పోలీసులు విచారణ పేరుతో తమను వేధిస్తున్నారని దిశ తల్లిదండ్రులు ఆరోపించారు. ఇందుకు కాలనీ వాసులు సైతం  దిశా తల్లి తండ్రులకు  మద్దతు పలికారు. ఎన్‌హెచ్‌ఆర్సీ తీరుకు నిరసనగా దిశ నివాసం వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.కాసేపటికి పోలీసులు దిశ తల్లిదండ్రులకు నచ్చ చెప్పి, విచారణకు వచ్చేందుకు ఒప్పించారు.

 

దీంతో దిశ సోదరి సహా తల్లిదండ్రులు పోలీసులు సమకూర్చిన ప్రత్యేక వాహనంలో విచారణకు కోసం వెళ్లారు.. ఈ విచారణ గంటపాటు జరిగినట్లు సమాచారం  . ఎన్‌కౌంటర్‌కు ముందు నలుగురు నిందితుల చేతిలో గాయాలపాలైన ఇద్దరు పోలీసులు వెంకటేశ్వర్లు, అరవింద్‌ గౌడ్‌ను కూడా ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం మరోసారి ప్రశ్నించే అవకాశం ఉంది. ఆదివారం సాయంత్రమే కేర్‌ ఆసుపత్రికి వెళ్లి వారిని విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. వీరి వాంగ్మూలం కూడా రికార్డు చేస్తారని పోలీసు వర్గాలు తెలిపాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: