హైదరాబాద్ షాద్నగర్ లో దిశ అనే వైద్యురాలిని నలుగురు నిందితులు  పథకం ప్రకారం అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే దిశ నిందితులకు కఠిన శిక్ష పడాలి అంటూ ఈ దేశం మొత్తం నినదించింది. దిశా నిందితులకు ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అయితే నిర్భయ ఘటన తర్వాత దేశం మొత్తానికి చేరిన ఘటనా దిశా ఘటన కావడంతో ఈ ఘటనపై దేశం మొత్తం భగ్గుమంది .ఆ కిరాతకులు మీరు చంపకపోతే మా మధ్య కి పంపించండి నేను చంపేస్తాం  అంటూ  నిరసనలు వెల్లువెత్తాయి. మరోసారి ఆడపిల్లలపై అఘాయిత్యాలు చేయాలనంటేనే  కామాంధులు భయపడాల్సిన పరిస్థితి వచ్చేలా దిశా కేసులో నిందితులకు శిక్ష విధించాలని డిమాండ్ చేసింది దేశ ప్రజానీకం. ఈ నేపథ్యంలో దిశా  కేసులోని నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేసారు పోలీసులు. 

 

 

 

 అయితే దిశ కేసూ నిందితులను  ఎన్కౌంటర్ సందర్భంగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆయనకు పెద్ద తలనొప్పి తెచ్చి పెడుతున్నాయి. దిశ కేసులోని నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన  అనంతరం స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...ఇది  కెసిఆర్ ఉగ్రరూపం అంటూ వ్యాఖ్యానించారు. దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్ దేశానికి మార్గదర్శకం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసులో నిందితులు ఇంకా జైలులోనే ఉన్నారని మంత్రి తలసాని తెలిపారు. 

 

 

 

 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనన్ని  చాలా తక్కువగా అంచనా వేశారని... ఆయన మౌనం వెనుక దాగిఉన్న  గ్రూపు ఇదేనంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశం మొత్తం తెలంగాణ వైపు చూతుందన్నారు ... ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని జాతీయ నేతలు సైతం ప్రశంసిస్తున్నారు అంటూ మంత్రి తలసాని వ్యాఖ్యానించారు. అయితే దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తప్పు పడుతుంది. దిశా  కేసులో నిందితులను ఎన్కౌంటర్ టిఆర్ఎస్ పార్టీ తన రాజకీయ లబ్ధి కోసం  వాడుకోవాలని చూస్తున్నట్లు బీజేపీ నేత కృష్ణసాగర్ రావు ఆరోపించారు. ఇలాంటి విషయంలో కూడా రాజకీయ లబ్ది పొందాలని చూడటం సరైన పద్ధతి కాదని... తలసాని వ్యాఖ్యలపై హైకోర్టు జోక్యం చేసుకోవాలంటూ కోరారు

మరింత సమాచారం తెలుసుకోండి: