తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు... నిజాంబాద్ మాజీ పార్లమెంటు సభ్యురాలు... తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవిత... తండ్రి కేసీఆర్ ను తలపించే ఆసక్తికరమైన ఆకర్షించే ప్రసంగాలతో ప్రజలను ఆకర్షిస్తు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహించగా బతుకమ్మ పండుగలో ఆడి పాడి ప్రతి ఇంటికి ఓ ఆడబిడ్డ లా మారిపోయింది మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. అయితే మాజీ ఎంపీ కవిత తాజాగా మరో ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని దక్కించుకుంది. హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో జరగబోయే ఇండియన్ డెమోక్రసీ ఎయిట్ వర్క్ సదస్సులో పాల్గొనాల్సిందిగా మాజీ పార్లమెంట్ సభ్యురాలు కవిత కు పిలుపు వచ్చింది. ఈ సదస్సులో పాల్గొని ప్రసంగించాల్సిందిగా  నిర్వాహకులు కవితను ఆహ్వానించారు. 

 

 

 

 అయితే ఎంతో మంది ప్రముఖుల కూడా ఈ సదస్సుకు విచ్చేసి ఇక్కడ తమ ప్రసంగాలను వినిపించనున్నారు. అయితే ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు కవిత కు ఆహ్వానం రావడంతో కవిత అరుదైన  గౌరవాన్ని సొంతం చేసుకున్నారు . కాగా వచ్చే ఏడాది జనవరి 9,  10 తేదీల్లో ఈ సదస్సు జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిష్టాత్మక సదస్సులో మాజీ పార్లమెంటు సభ్యురాలు కవిత రాజకీయాల్లో డబ్బు పాత్ర ఏంటి అనే దానిపై ప్రసంగించినున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సదస్సు వచ్చే సంవత్సరం జనవరి 9, 10వ తేదీల్లో రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో ప్రముఖులు పాల్గొంటున్నారు. కాగా ప్రముఖులు తన ప్రసంగాలను సదస్సులు వినిపించనున్నారు. 

 

 

 

 ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జాతీయ ఎన్నికల సంఘం కమిషనర్ అశోక్ లావాస, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, బీజేపీ నేత రాంమాధవ్, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్, సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి సహా లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు, ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ, ప్రముఖ రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ తో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ సదస్సులో పాల్గొన్న ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సదస్సుకు హాజరయ్యేందుకు సామాన్య ప్రజలకు కూడా అవకాశం కల్పించారు నిర్వాహకులు. దీని కోసం ఇండియన్ డెమోక్రసీ ఎట్ వర్క్  వెబ్సైట్లోకి తమ  పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే డిసెంబర్ 20 చివరి తేదీకాగా  ఆలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: