చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మంగళగిరిలో రాష్ట్రపార్టీ కార్యాలయం భవనాన్ని చంద్రబాబునాయుడు  ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. శుక్రవారం పార్టీ అఫీసు భవనాన్ని ప్రారంభించారో లేదో  సీనియర్ నేత, మాజీ ఎంఎల్ఏ బీద మస్తాన్ రావు పార్టీకి రాజీనామా చేసేశారు. ఇటు ఆఫీసు ప్రారంభమవ్వటం అటు రాజీనామా లేఖ అందటం ఒకేసారి జరిగాయి.

 

బీద మస్తాన్ రావంటే కేవలం పార్టీలో సీనియర్ నేత  మాత్రమే కాదు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల్లో ఒకడు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు బినామీల్లో ఒకడుగా బీద ప్రచారంలో ఉన్నారు. నెల్లూరు జిల్లాలోని క్యాష్ పార్టీలో ఒకడు. అలాంటి నేత పార్టీకి రాజీనామా చేసి వైసిపి కండువా కప్పుకోవటమంటే చంద్రబాబుకు మామూలు దెబ్బ కాదు.

 

ఒకవైపు చంద్రబాబు అండ్ కో జగన్మోహన్ రెడ్ది బిసిలను మోసం చేస్తున్నాడంటూ ఆరోపణలు చేస్తున్న నేపధ్యంలోనే బిసి సామాజికవర్గానికే చెందిన బీద మస్తాన్ రావు యాదవ్ టిడిపి నుండి వైసిపిలోకి చేరాడంటే ఏమిటర్ధం ?  బీద పార్టీ మారిపోవటం అంటే పార్టీ పరంగానే కాకుండా సామాజకవర్గం, ఆర్దికపరంగా కూడా చంద్రబాబుకు లాసనే చెప్పాలి.

 

ముహూర్తం చూసుకుని మరీ చంద్రబాబు పార్టీలోకి అడుగుపెట్టగానే  పెద్ద వికెట్ పడిపోవటంతో అందరూ కంగారు పడుతున్నారు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల్లోపే మరో ఏడుగురు ఎంఎల్ఏలు కూడా పార్టీకి రాజీనామా చేయటానికి రెడీ అవుతున్నారనే ప్రచారంతో చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది. నిజంగా అదే గనుక జరిగితే చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా గోవిందానే.

 

ఇదే పద్దతిలో జగన్ ను ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం చాలానే ప్రయత్నాలు చేశారు. పార్టీ తరపున గెలిచిన 67 మంది ఎంఎల్ఏల్లో 23 మంది ఎంఎల్ఏలను లాగేసుకున్నారు.  ప్రలోభాలకు గురిచేసి  విచ్చలవిడిగా ఫిరాయింపులకు పాల్పడ్డారు. చంద్రబాబు ఎంత ప్రయత్నించినా చివరకు వ్రతమూ చెడింది ఫలితమూ దక్కలేదనుకోండి అది వేరే సంగతి. అప్పట్లో తాను చేద్దామని అనుకున్న వ్యూహం తొందరలో చంద్రబాబు మెడకే చుట్టుకునేట్లుంది. అందుకనే పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ ముహూర్తం బాగాలేదని పార్టీలోనే చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: