గత కొన్ని నెలలుగా ఆర్థిక మాంద్యం ప్రభావం వలన దేశంలో ఉద్యోగాలపై వేటు మొదలైంది. ప్రజల కొనుగోలు శక్తి భారీగా పడిపోవటం ఆర్థిక మాంద్యానికి సంకేతంగా నిలుస్తోంది. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ ఆర్థిక మాంద్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి విమర్శలు చేశారు. ఒక ప్రముఖ పత్రికలో ఆర్థిక మాంద్యం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను గట్టేక్కించే విషయంలో సూచనలిస్తూ రఘురామరాజన్ వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో రఘురామరాజన్ ప్రధానమంత్రికార్యాలయంపై విమర్శలు చేశారు. ప్రధాన మంత్రి కార్యాలయంలోనే అధికారాలన్నీ కేంద్రీకృతమయ్యాయని విమర్శలు చేశారు. 
 
దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకునే సూచనలు కనిపిస్తున్నాయని మంత్రుల చేతుల్లో అధికారం లేకపోవడం వలన ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలని రఘురామరాజన్ అన్నారు. అధికారాలు కేంద్రీకృతం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మొదట గమనించాలని రఘురామరాజన్ సూచనలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ మాత్రమే నిర్ణయాలు తీసుకోకుండా తన చుట్టూ ఉన్నవారి సూచనలు తీసుకోవాలని అన్నారు. 
 
ప్రధాని నరేంద్ర మోదీ కింది స్థాయి వ్యక్తుల సలహాలు కూడా తీసుకోవాలని రఘరామరాజన్ అన్నారు. ప్రధాని మోదీ కింది స్థాయి వ్యక్తులు సూచనలు తీసుకోవటం బీజేపీ పార్టీ రాజకీయ ఎజెండాకు, సామాజిక ఎజెండాకు మేలు చేస్తుందని రాజన్ అన్నారు. భవిష్యత్ సంస్కరణల అమలులో గత ప్రభుత్వాలు స్థిరమైన మార్గం అనుసరించాయని రాజన్ చెప్పారు. ఆర్థిక మాంద్యం సమస్య తాత్కాలికం అని అనుకోకూడదని చెప్పారు. 
 
ప్రధానమంత్రి కార్యాలయం రాజకీయ ప్రేరేపిత అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని పీఎంవో కార్యాలయం పట్టించుకుంటే మాత్రం సంస్కరణల ప్రయత్నాలు వేగవంతమవుతాయని రఘురామరాజన్ అన్నారు. కొని సర్వేలు దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని తెలుపుతున్నాయని అలాంటి సర్వేల యొక్క సమాచారాన్ని ప్రభుత్వం తొక్కిపెట్టటం వలన ప్రయోజనం ఉండదని రఘురామరాజన్ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: