ఒక మంచిపనికి సమాజంలో గుర్తింపు రావాలంటే చాలా కష్టం. అదే ఒక చెడు చేసారంటే అందరి దృష్టిలో పడతారు అని ఇప్పుడు కొందరు ఆలోచిస్తున్నట్లుగా ఉన్నారు. ఇకపోతే దిశ సంఘటనలో జరిగిన ప్రతి పరిణామాలు ఎంతగా ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నాయో అందరు చూస్తూనే ఉన్నారు. ఆమె మరణం జరిగినప్పటి నుండి ఇప్పటివరకు ప్రతి చర్యను ప్రతి వారు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు.

 

 

ఇకపోతే నిందితుల విషయంలో అత్యంత గోప్యత పాటించిన అధికారులు తమపనిని  కూడా అంతే రహస్యంగా ముగించారు.. ఇక జరిగిన విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే దిశ నిందితులను సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం ఘటనా స్థలానికి తీసుకువెళితే వారు అక్కడినుంచి పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు జరిపిన కాల్పుల్లో వారంతా అక్కడికక్కడే మృతి చెందారని సమాచారం కాగా, అక్కడ జరిగిన ఎన్‌కౌంటర్‌లో పోలీసులు ఎన్ని బుల్లెట్లు వాడారు? ఎవరి శరీరంలో ఎన్ని బల్లెట్లు దిగాయి? అన్నది ఇప్పటివరకు అంతు చిక్కకుండా ఉంది.

 

 

అయితే మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. ఆ పోస్టుమార్టం నివేదికలో ఎవరి శరీరంలో ఎన్ని బుల్లెట్లు ఉన్నాయో బయటపడింది. మహ్మద్ ఆరిఫ్ శరీరం నుంచి నాలుగు బుల్లెట్లు, చెన్నకేశవులు శరీరం నుంచి రెండు బుల్లెట్లు లభించినట్లు సమాచారం. మరో ఇద్దరు నిందితులైన జొల్లు శివ, నవీన్‌ల శరీరాల నుంచి చెరో బుల్లెట్ లభించాయి. నిందితుల శరీరం నుంచి మరియు సంఘటన స్థలంలో మొత్తం కలిపి 12 బుల్లెట్లు పోలీసులకు లభించాయని అంటున్నారు...

 

 

ఇకపోతే ఈ నలుగురిని ఎన్‌కౌంటర్ చేయడంతో సమస్యకు పరిష్కారం దొరికినట్లు కాదని. ఇకముందు కూడా ఇలాంటి నిందితుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుని ముందుకు వెళ్లాలనే విషయాన్ని లోతుగా పరిశీలించి సమాజానికి పట్టిన ఈ రుగ్మతలను పూర్తిగా రూపుమాపాలని కొందరు మానవత్వం ఉన్నవారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇకపోతే ఎవరిదైనా ప్రాణమే అనే ఆలోచన లేకుండా కళ్లముందు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్న ఘటన ఒకటే సమాజంలో లేదు. ఇలాగే ఎందరో ఆడపిల్లలు బలి అవుతున్నారు అలాంటి వారికి కూడా న్యాయం అందించే దిశగా వ్యవస్ద మారాలని కోరుకుంటున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: