హైదరాబాద్ షాద్నగర్ లో దిశ అనే వైద్యురాలిని నలుగురు నిందితులు  పథకం ప్రకారం అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే దిశ నిందితులకు కఠిన శిక్ష పడాలి అంటూ ఈ దేశం మొత్తం నినదించింది. దిశా నిందితులకు ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అయితే నిర్భయ ఘటన తర్వాత దేశం మొత్తానికి చేరిన ఘటనా దిశా ఘటన కావడంతో ఈ ఘటనపై దేశం మొత్తం భగ్గుమంది .ఆ కిరాతకులు మీరు చంపకపోతే మా మధ్య కి పంపించండి నేను చంపేస్తాం  అంటూ  నిరసనలు వెల్లువెత్తాయి. మరోసారి ఆడపిల్లలపై అఘాయిత్యాలు చేయాలనంటేనే  కామాంధులు భయపడాల్సిన పరిస్థితి వచ్చేలా దిశా కేసులో నిందితులకు శిక్ష విధించాలని డిమాండ్ చేసింది దేశ ప్రజానీకం. ఈ నేపథ్యంలో దిశా  కేసులోని నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేసారు పోలీసులు. 

 

 

 

 దిశా కేసులో నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడంతో దేశం మొత్తం హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దిశ నిందితుల ఎన్కౌంటర్పై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దిశా  కేసులో నిందితులు ఎన్కౌంటర్ ను  సుమోటోగా తీసుకొని విచారణ జరుపుతుంది జాతీయ మానవ హక్కుల కమిషన్. ఇప్పటికే నిందితులను ఎన్కౌంటర్ చేసిన ఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులను పలు వివరాలు అడిగి తెలుసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్ ... దిశ తల్లిదండ్రుల నుంచి స్టేట్మెంట్ తీసుకోవాలని భావించింది . 

 

 

 అయితే దిశా తల్లిదండ్రుల నుంచి స్టేట్ మెంట్  తీసుకునేందుకు తాము బస చేస్తున్న పోలీసులు అకాడమీకి దిశ తల్లిదండ్రులను తీసుకురావాలని పోలీసులను ఆదేశించింది జాతీయ మానవ హక్కుల కమిషన్. దీంతో దిశా  తల్లిదండ్రులను తీసుకొచ్చేందుకు పోలీసులు శంషాబాద్ లోని నక్షత్ర అపార్ట్మెంట్స్ కి వెళ్లారు.కాగా  అక్కడ దిశ తల్లిదండ్రుల నుంచి పోలీసులకు వ్యతిరేకత ఎదురైంది.దిశా  దినకర్మ రోజున విచారణ పేరుతో తమ ఇబ్బందులకు గురి చేయడం తగదు అంటూ దిశా  తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా దిశా  తల్లి ఆరోగ్యం బాగాలేదని  పోలీసులు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు తెలిపారు .

మరింత సమాచారం తెలుసుకోండి: