జాబ్ చేసే వారైనా.. బిజినెస్ చేసే వారైనా.. అసలు ఏ పని చేయని వారైనా మగవాళ్ళు ఏం చేసినా చేయకపోయినా పెరిగేది ఒక్కటే అదే క్షవరం. జుట్టు, గెడ్డం కొన్నాళ్ళు చేయించకుండా ఉంటే ఏరా ఎంటలా జుట్టు పెంచావ్ ఎక్కడైనా మొక్కా అని కొందరు.. లవ్ ఫెయిల్యూర్ అని మరికొందరు ఆట పట్టించడం కామన్. 

 

మగవాళ్ళు ఎక్కువగా ఉండే రెగ్యులర్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది సెలూన్ అనే చెప్పాలి. గెడ్డం పెరిగితే షేవింగ్ ఎలాగోలా ఇంట్లో చేసుకోవచ్చు కాని కటింగ్ అలా కాదు. ఇక కటింగ్ షాప్ కు వెళ్తే అక్కడ ఎంత టైం పడుతుంది అన్నది చెప్పడం కష్టం. వీకెండ్ లో సెలూన్లు మరీ బిజీగా ఉంటాయి. 

 

సెలూన్ కి వెళ్తే రెండు మూడు గంటలు అక్కడ కేటాయించాల్సిందే. అందుకే అక్కడ పేపర్, టివిలు ఉంచుతారు. అయితే తమిళనాడులో ఒక సెలూన్ లో ఏకంగా ఒక చిన్నపాటి గ్రంథాలయాన్నే ఏర్పాటు చేశాడట. 

 

తన సెలూన్ కు వచ్చే వారికి బోర్ కొట్టకుండా తమిళనాడుకి చెందిన పొన్ మరియప్పన్ సెలూన్ లో ఏకంగా 200 పైగా బుక్స్ ఏర్పాటు చేశాడట. అన్ని బుక్స్ కూడా తన స్నేహితుల దగ్గర నుండి కలెక్ట్ చేసినవే అట. సెలూన్ కి వచ్చి ఏం చేయాలో తోచని వారు బుక్స్ చదువుకుంటారు. అందుకే మరియప్పన్ ఈ ప్లాన్ చేశాడు. 

 

మరియప్పన్ ప్లాన్ కు జనాలు కూడా షాక్ అవుతున్నారు. సెలూన్ లో ఎలాగూ గంటల కొద్దీ వెయిట్ చేయాల్సి ఉంటుంది. అదే మరియప్పన్ సెలూన్ లో అయితే బుక్స్ చదువుతూ టైం పాస్ చేయొచ్చు.. ఇప్పుడు అతని సెలూన్ గురించి వార్తల్లో రావడం అతని బిజినెస్ మరింత ప్లస్ అని చెప్పొచ్చు. మరియప్పన్ ఈ ప్లాన్ చూసి మరికొందరు కూడా సెలూన్ లో బుక్స్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: