దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దిశ హత్య కేసు నిందితులను పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. కానీ దిశపై అత్యాచారం, హత్య జరగటానికి వేరే కారణం కూడా ఉందని కొంతమంది అంటున్నారు. దిశ వృత్తిరిత్యా పశువైద్యురాలిగా పని చేసేది. పశుసంవర్ధక శాఖలో జరిగిన ఒక స్కామ్ వలనే దిశపై అత్యాచారం, హత్య జరిగిందని కొందరు చెబుతున్నారు. 
 
పశుసంవర్థక శాఖలో ఒక స్కామ్ జరిగిందని ఆ స్కామ్ దిశ దృష్టికి వచ్చిందని ఆ స్కామ్ కు సంబంధించిన వివరాలు దిశ బయటపెట్టే అవకాశం ఉందని భావించి నలుగురు నిందితులతో ప్లాన్ చేసి ప్లాన్ ప్రకారం దిశపై అత్యాచారం, హత్య చేయించారని కొందరు చెబుతున్నారు. నిందితులు పోలీసుల ఎన్ కౌంటర్ లో చనిపోవటం వలన ఈ విషయం నిజమో అబద్ధమో తెలియటం మాత్రం అంత తేలిక కాదు. 
 
మరోవైపు పోలీసులు ఎన్ కౌంటర్ లో ఉపయోగించిన బుల్లెట్లు ఇప్పటివరకూ రికవరీ కాలేదని తెలుస్తోంది. పోస్టుమార్టమ్ లో నలుగురు నిందితులకు 11 చోట్ల గాయాలు ఉన్నట్లు తేలింది. పోలీసులు ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలోనే బుల్లెట్ల గురించి వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అరీఫ్ శరీరంలో నాలుగు చోట్ల బుల్లెట్ గాయాలు ఉన్నాయని తెలుస్తోంది. 
 
మరో నిందితుడు శివ శరీరంపై మూడు బుల్లెట్ గాయాలు ఉన్నాయని సమాచారం. నవీన్ శరీరంపై కూడా మూడు బుల్లెట్ గాయాలు ఉన్నాయని చెన్నకేశవులు శరీరంపై మాత్రం ఒక బుల్లెట్ గాయం ఉందని తెలుస్తోంది. నిపుణులు ఎన్ కౌంటర్ దగ్గరనుండే జరిగిందని అందువలన బుల్లెట్లు శరీరం నుండి బయటకు వెళ్లిపోయాయని చెబుతున్నారు. దిశ ఘటన నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయటంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతూ ఉండగా కొంతమంది మాత్రం ఎన్ కౌంటర్ పై విమర్శలు చేస్తూ ఉండటం గమనార్హం. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: