సమాజం ఒక గొర్రెలాంటిదని అడుగడుగున నిరూపిస్తున్నారు కొందరు. ఎందుకంటే గొర్రెల మందలో ఒక గొర్రె వెరే దారివైపు వెళ్లిందనుకోండి మిగతా గొర్రెలు కూడా అటుగానే వెళ్లుతాయి. ఇలాగే లోకంలో ఒక వ్యక్తి ఓ ఆవేశపూరిత నిర్ణయం ప్రదర్శిస్తే మిగతావారు కూడా అదే దారిలో వెళ్లుతారు. ఇలా ప్రతి విషయంలో ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. దానికి ఉదాహరణగా ప్రేమించిన వాన్ని పెళ్లి చేసుకుందని అమృత తండ్రి నడి రోడ్డుపై ఆ యువకున్ని చంపించాడు. ఆతర్వాత వరుసగా అవే సంఘటనలు కనిపించాయి.

 

 

ఈ మద్య కాలంలో తహశీల్దార్‌ను పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన తర్వాత దాదాపు ఇలాంటి సంఘటనలే అన్ని చోట్ల మనకు కనిపిస్తున్నాయి. ఇదిగో ఇప్పుడు చూడబోయే ఘటన కూడా ఇలాంటిదే. ఏపీలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనాన్ని రేపింది. కొంత ఆందోళనను కూడా కలిగిస్తుంది. వివరాలు పరిశీలిస్తే. తనకు ఎస్సీ కార్పొరేషన్ మంజూరు చేసిన కారును అధికారులు తనకు అప్పగించనివ్వకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని, ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యే విడదల రజినికి ఓ వ్యక్తి హెచ్చరిక జారీ చేశాడు. తమ కుటుంబ పరిస్దితి అంతంత మాత్రమేనని అందులో ఎమ్మెల్యే గారు చేసిన పని వల్ల గత ఆరు నెలలుగా తనకు పూట గడవని పరిస్థితి నెలకొందని చెప్పాడు.

 

 

ఈ విషయాన్ని చిలకలూరి పేట నియోజకవర్గంలోని యడ్లపాడు మండలం వంకాయలపాడు గ్రామానికి చెందిన శామ్యూల్ అనే వ్యక్తి ఓ సెల్ఫీ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాను కాళ్లకు చెప్పులు అరిగిపోయేలా అధికారుల చుట్టూ తిరిగి ఎస్సీ కార్పొరేషన్‌లో స్వయం ఉపాధి కింద కారు మంజూరు చేయించుకున్నానని, అయితే, జూలై 8న అందరికీ కార్లు ఇచ్చే సమయంలో ఎమ్మెల్యే ఫోన్ చేసి తనకు మాత్రం ఆపాలని చెప్పడంతో అధికారులు తనకు కారు ఇవ్వలేదని బాధితుడు చెప్పాడు.

 

 

ఆరు నెలలుగా ఉపాధి లేకపోవడంతో తన భార్య, ఇద్దరు పిల్లలను వారి పుట్టింట్లో వదిలిపెట్టానని చెప్పాడు. డిసెంబర్ 15 లోపు తనకు తన కారు మంజూరు చేయించకపోతే గుంటూరు కలెక్టరేట్ ఎదుట తన కుటుంబం మొత్తం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటుందని విడదల రజినీని హెచ్చరిస్తూ బాధితుడు ఆ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశాడు.  ఇప్పుడు ఈ  వీడియో వైరల్‌గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: