నేటి నుంచి ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. దాదాపు పది రోజులపాటు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ శీతాకాల  సమావేశాల్లో  అసెంబ్లీలో దాదాపు 20 అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రశ్నోత్తరాల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పై ప్రభుత్వం కేంద్రం తో జరిపిన చర్చలు... ఎస్సీ ఎస్టీలకు విదేశాల్లో ఉన్నత విద్య కోసం అమలు చేస్తున్న పథకానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీ నుంచి ప్రభుత్వానికి ప్రశ్నలు ఎదురు కానున్నాయి. అంతేకాకుండా విద్యుత్తు రంగ సంస్కరణలు, తిరుపతి రహదారి పనులు సహా పలు అంశాలు అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు రానున్నాయి. 

 

 

 

 కాగా తొలి రోజు సమావేశంలో దిశా ఘటనపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల భద్రతపై ప్రభుత్వం తీసుకోబోయే కీలక నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే మహిళలకు ప్రభుత్వ పనుల్లో  50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జగన్ సర్కార్  శీతాకాల సమావేశాల్లో  నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా  రాష్ట్రంలోని జగన్ సర్కార్ పాలనలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రతిపక్ష టిడిపి ప్రశ్నలు సందించేందుకు సిద్ధమైంది. దీనికోసం 21 అంశాలను టిడిపి సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

 

 

 

 అయితే టీడీపీ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధం చేసుకున్న అంశాలలో ఇసుక కొరత,  రైతులకు గిట్టుబాటు ధరలు,  అమరావతి నిర్మాణం, రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత తో కార్మికుల ఆత్మహత్యలు సహ జగన్ ప్రభుత్వ ఆరు నెలల పాలన పై కూడా టిడిపి జగన్ ప్రభుత్వం పై ప్రశ్నలు సంధించనుంది . కాగా  ఏపీ అసెంబ్లీ సమావేశాలు రసాభాసగా మారే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అటు అధికార పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీ నుంచి ఎలాంటి ప్రశ్నలు ఎదురైనప్పటికీ దీటుగా సమాధానం ఇవ్వడానికి సిద్ధం అవుతుంది. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరుగుతున్న ఈ శీతాకాల సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలను వెల్లడించింది జగన్ సర్కార్.

మరింత సమాచారం తెలుసుకోండి: