చంద్రబాబునాయుడుకు పదిరోజుల పాటు అధికార పార్టీ సినిమా చూపించబోతోంది. ఈరోజు నుండి అసెంబ్లీ శీతాకాల  సమావేశాలు మొదలవుతున్నాయి. సమావేశాలను పదిరోజుల పాటు నిర్వహించాలని వైసిపి అనుకుంటే కాదు 15 రోజులు జరపాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. సరే సమావేశాలు ఎన్నిరోజులు జరపాలన్నది పూర్తిగా అధికారపార్టీ ఇష్టమేననుకోండి అది వేరే సంగతి.

 

మామూలుగా అయితే సమావేశాలు అంత హాటుగా నడిపించాల్సిన అవసరం వైసిపికి లేదు. కానీ కొన్ని ఇష్యూస్ ను చంద్రబాబు అండ్ కో కావాలనే రాద్దాంతం చేయాలని డిసైడ్ అయ్యింది. ఇసుక కొరత, ఇంగ్లీషుమీడియం, అన్న క్యాంటిన్ల మూసివేత, రివర్స్ టెండరింగ్, రాజదాని నిర్మాణం, హిదువేవాలయాల ప్రాంతాల్లో అన్యమత ప్రచారం, తాజాగా ఆర్టీసీ చార్జీల పెంపు లాంటి కీలక అంశాలు చాలానే ఉన్నాయి.

 

నిజానికి వీటిల్లో ఇసుకకొరత, అన్న క్యాంటిన్లు మాత్రమే కాస్త వివాదాస్పదమయ్యాయి. మిగిలిన అంశాలన్నింటినీ చంద్రబాబు, ఎల్లోమీడియా కావాలనే వివాదాస్పదం చేశాయి. సరే మంత్రులు,  వైసిపి నేతలు దానికి తగ్గట్లే తమదైన స్టైల్లో సమాధానాలిచ్చారు లేండి. అవన్నీ సభ బయట జరిగాయి. కాబట్టే ఇపుడు అవే అంశాలను టిడిపి సమావేశాల్లో లేవనెత్తాలని అనుకుంటోంది.

 

టిడిపి వైఖరి చూస్తుంటే తన నెత్తిన చెత్తేసుకుని వైసిపి నేత్తిన కూడా చెత్తేదామని అనుకుంటోంది. అయితే చెత్తేయించుకోవటానికి వైసిపి సిద్దంగా లేదు. అందుకనే సమావేశాలు చాలా హాటుహాటుగా జరిగే అవకాశాలే ఎక్కువున్నాయి. అందులోను టిడిపికి కొందరు ఎంఎల్ఏలు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అదే గనుక జరిగితే సమావేశాల్లో మరింత వేడి పుట్టటం ఖాయం.

 

మొత్తం మీద ఇటు అధికారపక్షం అటు ప్రతిపక్షం రెండు కూడా అసెంబ్లీ యుద్ధానికి రెడీగా ఉన్నాయి. కాకపోతే చంద్రబాబు అండ్ కో సభా సమరంలో తేలిపోవటం ఖాయం. ఎందుకంటే ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి మీద తన ఎల్లోమీడియా ద్వారా చంద్రబాబు చల్లించిన బురదకు అసెంబ్లీ వేదికగా వైసిపి తగిన సమాధానం చెప్పబోతోంది. కాకపోతే దాన్ని చంద్రబాబు తట్టుకోగలడా ? అన్నదే అనుమానం. ఎందుకంటే తన ఎంఎల్ఏలందరూ  మద్దతుగా నిలబడకపోతే చంద్రబాబుకు వైసిపి సినిమా చూపించటం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: