ఏపీలో అస‌లే అంతంత మాత్రంగా ఉన్న జాతీయ పార్టీ బీజేపీకి భారీ ఎదురు దెబ్బ‌త‌గ‌లుతోంది. ఈ పార్టీ త‌ర‌ఫున 2014లో ప‌శ్చి మ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం నుంచి పోటీ చేసి.. ఎంపీగా విజ‌యం సాధించిన ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త గోక‌రాజు గంగ‌రాజు.. అనూహ్యంగా యూట‌ర్న్ తీసుకున్నారు. కుటుంబ స‌మేతంగా ఆయ‌న వెళ్లి జ‌గ‌న్‌కు జై కొట్ట‌నున్నారు. ఒక‌ప‌క్క బీజేపీ ఏపీలో ఎద‌గాల‌ని చేస్తున్న ప్ర‌య‌త్నాలు క‌నిపిస్తుంటే.. ఆ పార్టీలోనే కీల‌క నేత‌గా ఉన్న‌, మాజీ ఎంపీ ఇప్పుడు పార్టీ మారి, బీజేపీ కి బ‌ద్ధ శ‌తృవుగా ఉన్న వైసీపీలో చేర‌డం ఆస‌క్తిగా మారింది. 

 

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం అనే నాయకులు కూడా ఈ ప‌రిణామంతో అచ్చ‌రువోందుతున్నారు. వాస్త‌వానికి గోక‌రాజుకు ఆర్ ఎస్ ఎస్ మూలాలు ఉన్నాయ‌ని అంటారు. గోక‌రాజు విద్యార్థి యూనియ‌న్ నాయ‌కుడిగా కంటే ముందు.. ఆయ‌న ఆర్ ఎస్ ఎస్ ప్ర‌చార‌క్‌గా ప‌నిచేశారు. అదేస‌మ యం లో ఆర్ ఎస్ ఎస్‌లో నేరుగా సంబంధ బాంధ‌వ్యాలు ఉన్నాయి. పైగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, ప్ర‌స్తుత హోం మంత్రి అమిత్ షాల‌తో నేరు గా మాట్లాడే చ‌నువున్న నాయ‌కుడుగా కూడా గోక‌రాజు గుర్తింపు పొందారు. గుజ‌రాత్‌లోనూ ఆయ‌న వ్యాపార సంస్థ‌లు ఉన్నా యి. బీజేపీలో సుదీర్ఘ సంబంధాలు కూడా ఉన్నాయి. 

 

ఈ క్ర‌మంలోనే గ‌త 2014 ఎన్నిక‌ల్లో గోక‌రాజుకు బీజేపీ ఎంపీ టికెట్ ల‌భించింద‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం. బీజేపీకి అత్యంత సానుకూల ప‌రుడిగా, ఆర్థికంగా కూడా బ‌లాన్ని అందించిన గోక‌రాజు ఇప్పుడు పార్టీ మార్పు.. అందునా.. అతిపెద్ద జాతీయ పార్టీని వీడి వైసీపీలోకి చేర‌డం ఆశ్చ‌ర్యంగానే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, రాష్ట్రంలో బీజేపీ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ఇప్ప‌ట్లో పుంజుకునే ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. పైగా ప్ర‌జ‌ల‌కు పార్టీకి మ‌ధ్య చాలా డిస్టెన్స్ ఉంది. జాతీయ స్థాయి నాయ‌కులు ఏపీకి వ‌చ్చి నాలుగు మాట‌లు విమ‌ర్శించ‌డం త‌ప్ప‌.. క్షేత్ర‌స్థాయిలో బీజేపీని నిలుపుకొనేందుకు, ప‌ట్టు పెంచుకునేందుకు ఎక్క‌డా ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. 

 

ఈ నేప‌థ్యంలోనే పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కూడా ప‌రుగులు పెట్టే ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఇక‌, గోక‌రాజు పార్టీ మారేందుకు ఇది ఒక కార‌ణ‌మా ?  లేక ఆయ‌న‌కు రాజ్య‌స‌భ టికెట్ విష‌యంలో అమిత్ షా ఇచ్చిన హామీ నెర‌వేర‌క పోవ‌డం మ‌రో ప్ర‌ధాన కార‌ణ‌మా ? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతం వైసీపీకి మ‌రో మూడు మాసాల్లో నాలుగు రాజ్య‌స‌భ్య సీట్లు ద‌క్కే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే గోక‌రాజు వైసీపీ చెంత‌కు చేరుతున్నార‌నే ప్ర‌చారం కూడా సాగుతోంది. ఏదేమైనా.. రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చ‌ని మ‌రోసారి రుజువైంది. అలాగే ఏపీలో జ‌గ‌న్ బీజేపీతో గేమ్ స్టార్ట్ చేసేశాడ‌నే చ‌ర్చ కూడా స్టార్ట్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: