హైదరాబాద్‌ మెట్రో రైల్‌ మరో తీపి వార్త చెప్పడానికి రెడీ అయిపోయింది.. అదేమంటే రెండో మెట్రోరైలు కారిడార్‌ను త్వరలో అందుబాటులోకి తేబోతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌ రూట్ నగర ప్రజలకు మొదటి కారిడార్‌ కింద అందుబాటులో ఉండగా. మూడో కారిడార్‌... నాగోల్‌ నుంచి రాయదుర్గం వరకూ ఏర్పాటైంది. మొదట ఇది హైటెక్‌ సిటీ వరకే నడిచినా ఈమధ్య రాయదుర్గం మైండ్ స్పేస్  వరకు పొడిగించారు.

 

 

ఇదేకాకుండా ఆ తర్వాత అక్కడి నుంచీ షటిల్ సర్వీసులు కూడా ఏర్పాటు చేశారు. ఇక మిగిలిన రెండో కారిడార్‌ జేబిఎస్ నుంచి ఎంజీబిఎస్ వరకు నిర్మించారు. ఇకపోతే రెండు వారాల నుండి రైళ్ల ట్రయల్ ఈ రూట్లో జరుగుతుండగా. ఇందులో భాగంగా సిగ్నలింగ్, పవర్, వేగం, ట్రాక్స్, స్టేషన్స్ అన్నీ చెక్ చేస్తున్నారు. ఈ పక్రియను అంతా కెనడాలోని థాలెస్ కంపెనీ పరిశీలిస్తోంది.

 

 

ఈ కంపెనీనే ఎందుకు ఈ విధానాన్ని పరిశీలిస్తుందని అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా. మెట్రో రైళ్లు ఆటో మేటిక్‌గా వెళ్లేలా టెక్నాలజీని ఇచ్చింది ఈ కంపెనీయే. వీరు పరిశీలించే అన్ని పరీక్షలూ విజయవంతంగా పూర్తయ్యాక... ఈ కంపెనీనే అంతా ఓకే అంటూ... ఓ సర్టిఫికెట్ ఇస్తుంది. ఆ తర్వాత... హాల్‌క్రో అనే మరో ఇంటర్నేషనల్ కంపెనీ... అంతర్గత భద్రత ఎలా ఉంది? ఈ రూట్‌లో ట్రైన్స్ వెళ్తే... ఏమాత్రం సెక్యూరిటీ ఉంటుంది అనే అంశాల్ని పరిశీలిస్తుంది.

 

 

ఆ తర్వాత ఆ కంపెనీ కూడా ఓ సర్టిఫికెట్ ఇస్తుంది. ఇక ఈ సర్టిఫికెట్లను ప్రభుత్వానికి చెందిన మెట్రోరైలు కమిషనర్‌కి ఇవ్వాల్సి ఉంటుంది. చివరిగా వాళ్లు వచ్చి రైళ్లలో ప్రయాణించి సంతృప్తి చెందితే... అప్పుడు వాళ్లు మరో సర్టిఫికెట్ ఇస్తారు. ఇలా నెలపాటూ... ఈ ప్రక్రియ జరుగుతుంది. అందువల్ల 2020 వరకు గాని రెండో కారిడార్ అందుబాటులోకి వస్తుందని మనం ఆశించవచ్చని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: