హైదరాబాద్ నగరవాసులకు మెట్రో రైలు మరో గుడ్ న్యూస్ చెప్పింది .  త్వరలో మెట్రో రైలు రెండవ కారిడార్ ను  ప్రారంభించేందుకు అంతా సిద్ధం చేసింది. దీంతో ప్రజలకు ప్రయాణ భారం తగ్గనుంది. ఇప్పటికే మెట్రో రైలు మొదటి కార్ కింద మియాపూర్ నుంచి ఎల్బీనగర్ రూట్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా మూడో కారిడార్ కిందనాగోల్  నుంచి రాయదుర్గం వరకు మెట్రో కారిడార్ ను ప్రారంభించింది. అయితే మొదట హైటెక్ సిటీ వరకే ఉన్న మెట్రో మూడవ కారిడార్  ఈమధ్య మైండ్స్పేస్ వరకు పొడిగించారు. ప్రస్తుతం కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న రెండో కారిడార్ జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు నిర్మించారు. 

 

 

 

 కాగా ఈ రెండవ కారిడార్ చాలా మంది ప్రజల ప్రయాణాలను సులభతరం చేయనుంది. ఎందుకంటే జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వెళ్లడానికి చాలా మంది ప్రయాణికులు వస్తుంటారు అయితే. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ కు  బస్సులో వెళితే మధ్యలో చాలా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. దీంతో ఇక్కడి నుంచి అక్కడికి చేరుకోవడానికి గంటల సమయం పడుతుంది. కానీ  ఇప్పుడు రెండో మెట్రో కారిడార్ అందుబాటులోకి  వస్తే తక్కువ సమయంలో ఎలాంటి ట్రాఫిక్ లేకుండా సాఫీగా ప్రయాణం సాగించవచ్చు. కాగా  ఈ రెండో కారిడార్  మెట్రో రైల్ రూట్ లో గత రెండు వారాల నుంచి రైల్ ట్రయల్ జరుగుతోంది. ఈ రూట్లో సిగ్నల్,  పవర్,వేగం,  ట్రాక్, స్టేషన్లు చెకింగ్ జరుగుతుంది. 

 

 

 ఇక ఆ తర్వాత ఈ రూట్లో భద్రత చెకింగ్  జరుగుతోంది. ఈ రూట్లో భద్రత ఎలా ఉంది... ఈ రూట్లో రైలు వెళ్లడం భద్రతతో కూడిన అంశమేనా అనేది ఒక కంపెనీ పరిశీలించి ప్రభుత్వానికి సర్టిఫికెట్ ఇవ్వనుంది. కాగా ఈ ప్రక్రియ నెలరోజులపాటు జరిగే అవకాశం ఉంది. దీంతో 2020 జనవరి నెలలో మెట్రో రెండవ కారిడార్ ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అటు నగరవాసులు కూడా ఈ రెండవ కారిడార్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే బస్సులో గంటలు గంటలు ప్రయాణం చేసే బదులు మెట్రో రైల్లో 15 నిమిషాల్లో  ప్రయాణం చేయవచ్చు అని భావిస్తున్నారు. కాగా ఈ రెండవ కారిడార్ ప్రారంభమైన తర్వాత మెట్రో కి సంపాదన కూడా భారీగానే పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: