తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు ఎక్కువవుతోంది. ఎముకలు కొరికే చలి తో ప్రజలు ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే  జంకుతున్నారు. ఇంట్లో ఉన్నా కూడా చలి తీవ్రత బాగానే ఉంటుంది. చలి కంట్రోల్ చేసేందుకు ఎన్ని దుస్తులు ధరించినప్పటికీ ఉపయోగం లేకుండాపోతుంది. ఎందుకంటే రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతు చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. ఏకంగా పొద్దున్నే వచ్చే సూర్యుని కూడా కప్పేస్తున్నది పొగమంచు . ఇక హైదరాబాద్ నగరంలో అయితే పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. ఎముకలు కొరికే చలి తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక పొద్దున్నే ఆఫీసులకు వెళ్ళేవారికి పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

 

 

 

 తెలంగాణలోని పలు జిల్లాల్లో చలి తీవ్రత తీవ్రంగా పెరుగుతోంది. ఉదయం 10:00 దాటినప్పటికీ కూడా పొగమంచు అలాగే ఉంటుంది. తీవ్రత పెరిగి పోయి పొగమంచు మొత్తం వ్యాపించడంతో మరోవైపు రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఎముకలు కొరికే చలి తో భయపడి పోతున్న ప్రజలు... ఒక దగ్గర చేరి మంట వేసుకొని దాని చుట్టూ కూర్చొని ఆనందపడి పోతున్నారు. ఇక ఆ మంట కాస్త అయిపోయాక మళ్ళీ చలితో వణికి పోతున్నారు. అయితే కేవలం రాత్రిపూటే కాదు పగలు కూడా ప్రజలను భయపెడుతుంది చలి . ఒకవైపు ఎండ వస్తున్నప్పటికీ మరోవైపు చల్లటి గాలులతో పట్టపగలు కూడా ప్రజలను వణికిస్తోంది. దీంతో పలు ఆరోగ్య సమస్యలు ఉన్న ప్రజలు ఈ భారీగా పెరిగి పోతున్న చలి తీవ్రతతో భయపడిపోతున్నారు. 

 

 

 

 కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో  వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఈశాన్య భారతం నుంచి చల్లటి గాలులు వీస్తుండడంతో వాతావరణం మరింత చల్లగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా  రాబోయే రెండు రోజుల్లో పగలు పొడిగా రాత్రి అత్యంత తీవ్ర చలిగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా  తెలుగు రాష్ట్రాల్లో  రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోయి  చలి తీవ్రత ఎక్కువవుతుంది  తెలంగాణలోని ఆదిలాబాద్ తో పాటు ఏపీలో విశాఖ మన్యంలో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఈ రెండు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: