ఓ వైపు చలి వణికిస్తుంటే.. మరోవైపు ఏపీ అసెంబ్లీ శీతాకాల రాజకీయ వర్గాల్లో వేడి పుట్టించనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శీతాకాల అసెంబ్లీ  సమావేశాలు నేడు(09 డిసెంబర్ 2019) ప్రారంభం కానున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలకమైన బిల్లులపై చర్చలు జరగనున్నాయి.  ఈ నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం అయ్యాయి. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సుమారు 10 రోజుల పాటు జరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా నేటి సమావేశంలో  పాఠశాల విద్యావిధానంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేయడం వంటి.. అంశాలపై చర్చించాలని ప్రభుత్వం ప్రభుత్వం భావిస్తోంది.

 

సమావేశాల తొలిరోజు దిశ ఘటనపై చర్చించి.. మహిళల భద్రతకు సంబంధించి కీలక నిర్ణయాలను ప్రభుత్వం వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పటకే సమావేశంలో ఉల్లి ఘాలు మొదలైంది.  రాష్ట్రంలో ఉల్లి తీవ్ర కొరత ఉందని.. ఉల్లి రేటు సామాన్యులకు భారంగా మారిందని ప్రతిపక్షాలు వాధిస్తున్నాయి. ఉల్లిధరలపై వాయిదా తీర్మాణం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఉల్లిదండలు మెడలో వేసుకొని ఈ రోజు నిరసన కూడా తెలిపారు. టీడీపీ నేతలు.  

 

ప్రభుత్వ వైఫల్యాలపై సభలో గట్టిగా నిలదీసేందుకు ప్రతిపక్ష టీడీపీ సిద్దంగా ఉందని తెలుస్తుంది. ఉల్లి, నిత్యావసరాల ధరల పెరుగుదల, ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు, ఇసుక ధర విపరీతంగా పెరిగిపోవడం, రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, అమరావతి సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పనులు నిలిపివేయడం వంటి ప్రధాన సమస్యలు టీడీపీ ప్రశ్నావళలిలో ఉన్నట్లు తెలుస్తుంది.

 

కాగా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బాగా సన్నద్ధమై సమావేశాలకు రావాలని, అన్ని రకాల చర్చల్లో చురుగ్గా పాల్గొని ప్రజల తరఫున గళం వినిపించాలని చంద్రబాబు ఇప్పటికే సూచించారు.  వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఇది రెండవసారి. ఈసారి అసెంబ్లీ సమావేశాలు రాజకీయంగా కూడా హీట్ పుట్టించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: