ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు  మొదలయ్యాయి. జగన్ ప్రభుత్వం అసెంబ్లీ శీతాకాల సమావేశాలు పలు కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటు ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ కూడా జగన్ ప్రభుత్వ పాలన లోని లోపాలను ఎండగడుతూ పలు ప్రశ్నల్ని సన్ దించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం కూడా చేసారు. కాగా  ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు మొదలవగా టిడిపి ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.కాగా  అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు జరుగుతూ ఉన్నాయి. 

 

 

 

 అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో  మొదటి రోజే ఉల్లిఘాటు భారీగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా పెరిగిన ఉల్లి ధరలను నిరసిస్తూ టిడిపి ఎమ్మెల్యేలు మెడలో ఉల్లిపాయలు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. అటు ఉల్లి ధరలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు టిడిపి ఎమ్మెల్యేలు. దీంతో మొదటి రోజే ఉల్లిఘాటు అసెంబ్లీపై భారీగానే పడింది. ఉల్లి ధరలు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతే కారణమని అసెంబ్లీలో ఆరోపిస్తున్నారు టిడిపి ఎమ్మెల్యేలు. అటు అధికార వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వం సబ్సిడీ కింద ఉల్లిపాయలను అందజేస్తుందని తెలిపారు. కాగా అసెంబ్లీ వద్ద భారీ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. 

 

 

 

 ఇదిలా ఉండగా అసెంబ్లీలో ఇసుక కొరత సమస్య గురించి కూడా టిడిపి ఎమ్మెల్యేలు జగన్ ప్రభుత్వం పై ప్రశ్నలు సందించేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. అటు అధికార వైసీపీ పార్టీ కూడా ప్రతిపక్షాల ప్రశ్నలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ అసెంబ్లీ ప్రారంభం అవ్వక ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కూడా అసెంబ్లీ సమావేశాల్లో  కీలకంగా చర్చించనున్నారు. అయితే ఈ శీతాకాల సమావేశాల్లో  ఉల్లి సమస్యతోపాటు... విద్యుత్ రంగ సంస్కరణలు... ఉద్యోగాలు ఉపాధి కల్పన.. ఇసుక కొరత సమస్య... వంటి పలు కీలక అంశాలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: