ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా మార్కాపురంలో దారుణం జరిగింది. వైజాగ్ కు చెందిన 22 సంవత్సరాల వయస్సు గల ఆషిక్ అనే యువకుడు కొన్ని నెలల క్రితం మార్కాపురం మండలంలోని రాయపురం గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఆషిక్ నివాసం ఉంటున్న పక్కింట్లో ఒక మైనర్ బాలిక తన కుటుంబ సభ్యులతో నివాసం ఉండేది. మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్న ఆషిక్ బాలికను ప్రేమిస్తున్నానని చెప్పి నమ్మించాడు. 
 
ఆ తరువాత బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో త్వరలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికపై ఆషిక్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులకు తెలియకుండా ఆషిక్ తో సినిమాలకు, షికార్లకు తిరిగేది. బాలిక కొన్ని రోజుల క్రితం ఆషిక్ ను వివాహం చేసుకోవాలని కోరగా ఆషిక్ తనకు బాలికను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పాడు. ఇద్దరం కలిసి తిరిగామని, ఎంజాయ్ చేశామని పెళ్లి మాత్రం చేసుకోవటం కుదరదని తేల్చి చెప్పాడు. 
 
బాలికకు ఆషిక్ తనను మోసం చేశాడని అర్థమైంది. బాలిక తన తల్లిదండ్రులకు యువకుడు ఏ విధంగా నమ్మించి మోసం చేశాడో చెప్పింది. విషయం తెలిసిన వెంటనే బాలిక తల్లిదండ్రులు మార్కాపురం పోలీస్ స్టేషన్ లో ఆషిక్ పై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు ఆషిక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 
 
బాలిక ప్రస్తుతం గర్భవతి అని తెలుస్తోంది. ఎస్సై గంగుల వెంకట్ మాట్లాడుతూ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని ప్రేమ పేరుతో బాలికను ముగ్గులోకి దింపిన ఆషిక్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి లొంగదీసుకున్నాడని చెప్పారు. బాధితురాలు నిందితుడు ఆషిక్ స్వస్థలం వైజాగ్ అని చెప్పిందని ఆ దిశగా దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: