హైదరాబాద్ షాద్నగర్ లో దిశ అనే వైద్యురాలిని నలుగురు నిందితులు  పథకం ప్రకారం అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే దిశ నిందితులకు కఠిన శిక్ష పడాలి అంటూ ఈ దేశం మొత్తం నినదించింది. దిశా నిందితులకు ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అయితే నిర్భయ ఘటన తర్వాత దేశం మొత్తానికి చేరిన ఘటనా దిశా ఘటన కావడంతో ఈ ఘటనపై దేశం మొత్తం భగ్గుమంది .ఆ కిరాతకులు మీరు చంపకపోతే మా మధ్య కి పంపించండి నేను చంపేస్తాం  అంటూ  నిరసనలు వెల్లువెత్తాయి. మరోసారి ఆడపిల్లలపై అఘాయిత్యాలు చేయాలనంటేనే  కామాంధులు భయపడాల్సిన పరిస్థితి వచ్చేలా దిశా కేసులో నిందితులకు శిక్ష విధించాలని డిమాండ్ చేసింది దేశ ప్రజానీకం. ఈ నేపథ్యంలో దిశా  కేసులోని నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేసారు పోలీసులు.

 

 

 

 అయితే దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్పై విచారణకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ప్రస్తుతం ప్రభుత్వం దిశా  కేసు నిందితుల ఎన్కౌంటర్ పై విచారణకు  సిట్  ఏర్పాటు చేసింది. ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ నేతృత్వం వహించినట్లు తెలుస్తోంది. వనపర్తి ఎస్.పి అపూర్వ రావు,  మంచిర్యాల డిసిపి ఉదయ్ కుమార్ రెడ్డి, రాచకొండ ఎస్వోటీ డిసిపి సురేందర్, సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్సంగారెడ్డి డిసిఆర్బి సిఐ వేణుగోపాల్ రెడ్డి ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం లో సభ్యులుగా ఉన్నారు.

 

 

 

 అయితే దిశా  కేసులో నిందితుల ఎన్కౌంటర్పై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు నిందితుల ఎన్కౌంటర్పై హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇదిలా ఉండగా అటు జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా విశాఖ కేసులో నిందితుల ఎన్కౌంటర్పై విచారణ జరుపుతోంది. ఇప్పటికే నిందితుల ఎన్కౌంటర్ జరిగిన స్థలాన్ని పరిశీలించడంతో పాటు అటు పోలీసులను  పలు వివరాలు అడిగి తెలుసుకుంది. అంతేకాకుండా దిశ తల్లిదండ్రుల నుంచి స్టేట్మెంట్ కూడా స్వీకరించింది జాతీయ మానవ హక్కుల కమిషన్.

మరింత సమాచారం తెలుసుకోండి: