ప్రజాసమస్యలపై పాదయాత్ర చేసేంత సీన్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఉందా ?  ఇపుడిదే ప్రశ్న అందరిలోను మొదలైంది. ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్ పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. అదే విషయాన్ని పవన్ ప్రస్తావిస్తు అప్పుడు పాదయాత్ర చేయటం కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇపుడు పాదయాత్ర చేయాలంటూ జగన్మోహన్ రెడ్డికి పవన్ సూచించటమే తెలివి తక్కువ తనం బయటపడుతోంది.

 

ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నపుడే పాదయాత్రలు, నిరసనలు చేస్తారు కానీ అధికారంలో ఉన్నపుడు కాదన్న కనీసం ఇంగితం కూడా పవన్ కు లేదు. పైగా ప్రజా సమస్యలను పరిష్కరించలేకపోతే పాదయాత్ర చేయాల్సుంటుందంటూ జగన్ ను హెచ్చరించారు. అంటే సమస్యలు పరిష్కారం కాకపోతే తానే పాదయాత్ర చేయాల్సుంటుందనే అర్ధం వచ్చేట్లు పవన్ వ్యాఖ్యలు చేయటమే విచిత్రంగా ఉంది.

 

నిజానికి ప్రజా సమస్యలపై ఉద్యమాలో, ఆందోళనలో చేసేంత ఓపిక పవన్ కు లేదన్న విషయం అందరికీ తెలుసు.  మొన్నటి ఎన్నికలకు ముందు కూడా పాదయాత్ర గురించి మాట్లాడుతూ తాను రోడ్లపైకి వస్తే లక్షలాది మంది వచ్చేస్తారని చెప్పారు. శాంతి భద్రతల సమస్య వస్తుందనే తాను పాదయాత్ర చేయటం లేదని ఎన్నోసార్లు చెప్పారు. అంటే పాదయాత్ర చేసే ఆలోచన పవన్ కు లేదని స్పష్టమైపోతోంది.

 

యాత్రల పేరుతో గట్టిగా నాలుగు రోజులు జనాల్లో తిరిగితే మళ్ళీ నెలరోజులు ఎవరికీ అడ్రస్ దొరకరు.  మొన్నటికి మొన్న ఇసుక కొరతపై విశాఖపట్నంలో  లాంగ్ మార్చని చెప్పి ఓ 3 కిలోమీటర్లు వాహనంపై ప్రయాణం చేసిన ఘనుడు పవన్ . ప్రజా సమస్యలూ పట్టవు, సమస్యలకు పరిష్కారమూ తెలీదు పవన్ కు.

 

పవన్ కు తెలిసిందల్లా  చంద్రబాబునాయుడుకు మద్దతుగా జగన్ పై నోటికొచ్చినట్లు ఆరోపణలు చేయటమే. ఎక్కడెక్కడి అంశాలను జగన్ కు ముడేసి నోరుపారేసుకోవటమే. చంద్రబాబు హయాంలో రాజధాని ప్రాంతంలో రైతుల సమస్యలపై పవన్ ఏ మేరకు ఉద్యమాలు చూసింది అందరూ చూసిందే. కాబట్టి ప్రజాసమస్యలపై ఉద్యమాలు చేసేంత సీన్ పవన్ కు లేదని అందరికీ తెలుసు. ఏదో బెదిరించుకుంటూ కాలం గడిపేయటమే పవన్ టార్గెట్ గా అనిపిస్తోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: