ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ గత కొద్ది రోజులుగా టిడిపి పై... ఆ పార్టీ అధినేత చంద్రబాబు. యువ‌నేత లోకేష్‌ పై తీవ్రమైన విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీకి దగ్గరైన ఇప్పుడు అసెంబ్లీ లో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారారు. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజున వంశీ ఏం చేస్తారు ? ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

 

ఇక తొలిరోజే సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఇక స‌మావేశాల‌కు తొలి రోజే హాజ‌రైన వంశీ ఆయన టీడీపీ బెంచీల వైపు వెనుక వరుసలో కూర్చున్నారు. టీడీపీకి రాజీనామా చేయడం.. ఇటు వైసీపీలో చేరకపోవడంతో వంశీ ఎక్క‌డ కూర్చొంటాడు అన్న‌ది కూడా అంద‌రిలోనూ ఆస‌క్తి రేపింది. అయితే వంశీ అటూ.. ఇటూ కాకుండా టీడీపీ సభ్యులు కూర్చున్న వెనుకవైపు బెంచీలో కూర్చున్నారు.

 

ఇక వంశీతో మాట్లాడేందుకు టీడీపీ స‌భ్యులు ఎవ్వ‌రూ ఆస‌క్తి చూప‌లేదు. కొంద‌రు వైసీపీ స‌భ్యులు మాత్రం వంశీని ప‌ల‌క‌రించారు. ఎందుకో గాని వంశీ తొలి రోజు ఎక్కువ మందితో మాట్లాడేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌లేదు. కాగా.. తాను త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నానని.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితోనే తన పయనమని వంశీ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.

 

ఇక వంశీ ఇప్ప‌టికే త‌న జిల్లాకే చెందిన మంత్రులు కొడాలి నాని, పేర్ని నానితో క‌లిసి ఇప్ప‌టికే జ‌గ‌న్‌తో రెండు, మూడు సార్లు భేటీ అయ్యారు. అదే టైంలో వైసీపీకి చెందిన కీల‌క నేత‌ల‌తో కూడా వంశీ ప‌లు మార్లు భేటీ అవ్వ‌డంతో ఇక ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తారా ?  లేదా స్వ‌తంత్య్రంగా ఉంటూ వైసీపీకి మ‌ద్ద‌తు ఇస్తారా ? అన్న‌ది మాత్ర‌మే చూడాలి. ఇక గ‌న్న‌వ‌రంలో వైసీపీ ఇన్‌చార్జ్ యార్ల‌గ‌డ్డ పేరు ఆప్కాబ్‌కు విన‌ప‌డుతుండ‌డంతో వంశీకి అక్క‌డ దాదాపు లైన్ క్లీయ‌ర్ అయ్యింద‌నే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: