హైదరాబాద్ షాద్నగర్ లో దిశ అనే వైద్యురాలిని నలుగురు నిందితులు  పథకం ప్రకారం అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే దిశ నిందితులకు కఠిన శిక్ష పడాలి అంటూ ఈ దేశం మొత్తం నినదించింది. దిశా నిందితులకు ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అయితే నిర్భయ ఘటన తర్వాత దేశం మొత్తానికి చేరిన ఘటనా దిశా ఘటన కావడంతో ఈ ఘటనపై దేశం మొత్తం భగ్గుమంది .ఆ కిరాతకులు మీరు చంపకపోతే మా మధ్య కి పంపించండి నేను చంపేస్తాం  అంటూ  నిరసనలు వెల్లువెత్తాయి. మరోసారి ఆడపిల్లలపై అఘాయిత్యాలు చేయాలనంటేనే  కామాంధులు భయపడాల్సిన పరిస్థితి వచ్చేలా దిశా కేసులో నిందితులకు శిక్ష విధించాలని డిమాండ్ చేసింది దేశ ప్రజానీకం. ఈ నేపథ్యంలో దిశా  కేసులోని నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేసారు పోలీసులు. 

 

 

 

 కాగా దిశ కేసులో నిందితుల మృతదేహాలను పోస్టుమార్టం చేసిన విషయం తెలిసిందే. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో దిశా  కేసులో నిందితుల పోస్టుమార్టం జరిగింది. అయితే  దిశ కేసులో నిందితుల మృతదేహాలను  కుటుంబ సభ్యులకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాగా హైకోర్టులో దాఖలైన పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది. అంతే కాకుండా కోర్టు విచారణ పూర్తి కాకముందే నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపడం పై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా సంఘాలు హై కోర్టును ఆశ్రయించాయి. కాగా దీనిపై విచారణ జరుపుతున్న హైకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. 

 

 

 

 అయితే నేడు దిశ తల్లిదండ్రులను జాతీయ మానవ హక్కుల కమిషన్ కలవనున్నట్లు తెలుస్తుంది . అంతేకాకుండా దిశ పనిచేసిన వేటర్నిటీ హాస్పిటల్ లో మహిళా డాక్టర్లకు నైట్ షిప్టులో ను రద్దు చేయాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ కోరనుంది.అటు దిశా  తల్లిదండ్రులు కూడా తమ చిన్న కూతురు భవ్య రెడ్డి భవ్యరెడ్డి ని దృష్టిలో  పెట్టుకుని నైట్ షిప్టులు  రద్దు చేయాలని హాస్పిటల్ యాజమాన్యాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది.కాగా దిశా  కేసులో నిందితుల ఎన్కౌంటర్పై విచారణను ప్రభుత్వం సీట్ కు అప్పగించింది. రాచకొండ సీపీ మహేష్ భగవత్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యులతో సిట్  ఎన్కౌంటర్ పై విచారణ జరపనుంది. ప్రస్తుతం నిందితుల మృతదేహాలను  కుటుంబ సభ్యులకు అప్పగించాలని వద్దా అనే దానిపై కోర్టు తీర్పు వెలువరించనుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: