ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు  మొదలయ్యాయి. జగన్ ప్రభుత్వం అసెంబ్లీ శీతాకాల సమావేశాలు పలు కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటు ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ కూడా జగన్ ప్రభుత్వ పాలన లోని లోపాలను ఎండగడుతూ పలు ప్రశ్నల్ని సన్ దించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం కూడా చేసారు. కాగా  ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు మొదలవగా టిడిపి ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.కాగా  అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు జరుగుతూ ఉన్నాయి.

 

 

 

 ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల క్రితం టిడిపి పార్టీకి గుడ్బై చెప్పి ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. అయితే వల్లభనేని వంశీ చేసిన విమర్శలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపాయి.తన  రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టినప్పటి నుంచి టిడిపి పార్టీలోనే కొనసాగిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి గుడ్ బై చెప్పడం తో పాటు టిడిపి అధినేత చంద్రబాబు పైనే ఎన్నో సంచలన విమర్శలు చేశారు. అయితే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ లోకి చేరుతారు  అని ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్నప్పటికీ... వంశి వైసిపి తీర్థం పుచ్చుకోవడానికి ఇప్పటికీ ముహూర్తం ఖరారు కాలేదు. 

 

 

 

 కాగా నేటి నుంచి ప్రారంభమైన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ సమావేశాల్లో  టిడిపికి గుడ్బై చెప్పిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అయితే ఆయన అసెంబ్లీలో టీడీపీ పార్టీకి కేటాయించిన సీట్ లోనే  వెనుక వరుసలో కూర్చున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చంద్రబాబు పై ఘాటు విమర్శలు చేసిన వల్లభనేని వంశీ... మరి శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. టీడీపీకి కేటాయించిన సీట్లలో కూర్చున్న వల్లభనేని వంశీ ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉండి పోతారా... లేక అసెంబ్లీ వేదికగా కూడా టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: